Bigg Boss: దేశవ్యాప్తంగా బుల్లితెరపై బిగ్ బాస్ హవా నడుస్తోంది. భారతదేశంలోని పాపులర్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం.. ఇలా ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసింది. అన్ని భాషల్లోనూ ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. సీజన్ కు సీజన్ కు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో కొనసాగుతోంది. మరి వీటి టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో వాటిపై ఓ లుక్కేద్దాం.
Read Also: Bigg Boss Telugu: సంజనా.. నీకు నాకు పెళ్లి చూపులా..? నాగ్ షాకింగ్ రియాక్షన్
మోహన్ లాల్ దే టాప్..
ప్రస్తుతం టీవీ రేటింగ్ ల పరంగా చూస్తే బిగ్ బాస్ మలయాళం టాప్ లో ఉంది. ఈ బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 టీఆర్పీ ప్రస్తుతం 12.1 గా ఉంది. అన్ని భాషలతో పోలిస్తే ఇదే నంబర్ వన్ గా కొనసాగుతోంది. దీనికి సూపర్ స్టార్ మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది వారపు రోజుల్లో 7.4, వీకెండ్ లో 10.9 రేటింగ్ రాబడుతోంది. దీనికి కిచ్చా సుదీప్ హోస్ట్.
తెలుగు బిగ్ బాస్ కు షాక్..
ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు బిగ్ బాస్ కు షాక్ తగిలింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ను రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చూస్తారు. అయినా మలయాళం, కన్నడతో పోల్చుకుంటే టీఆర్పీ తక్కువే ఉంది. బిగ్ బాస్ 9 తెలుగు 11.1 రేటింగ్ తో మూడో స్థానంలో ఉంది. దీనికి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 టీవీలో 3.4 కోట్ల మంది వీక్షకులను చేరుకుంది. ఈ తమిళ్ వెర్షన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా ఉన్నారు. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ఈ వారం రేటింగ్స్‌లో 1.1 నుండి 1.3కి పెరిగింది. వీకెండ్ రేటింగ్స్ 1.8గా ఉన్నాయి. ఈ షోకు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్.
Read Also: Bigg Boss New Promo: కలిసిపోయిన ఇమ్మూ- తనూ.. గోలిసోడా గేమ్ లో గెలుపెవరిదంటే?


