Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Suman Shetty: శెట్టి కప్పు కొట్టేనా? 100 శాతం సుమన్ అన్న హిట్టు..!

Suman Shetty: శెట్టి కప్పు కొట్టేనా? 100 శాతం సుమన్ అన్న హిట్టు..!

Suman Shetty: బిగ్ బాస్ హౌస్ లో ఈసారి మంచోళ్లు ఎక్కువయ్యారయ్యో. ఓ సాయి శ్రీనివాస్, ఓ రాము రాథోడ్, ఓ సుమన్ శెట్టి.  ఇక, జన్యున్ గా ఆడుతున్నది ఎవరు అంటే ప్రేక్షకులు చెప్పే మాట సుమన్ శెట్టి. తన గేమ్ తాను ఆడుతూ.. హౌస్ లో ఎవరితో అనవసరంగా గొడవలు, వాదనలు పెట్టుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు సుమన్ శెట్టి.. టాస్క్ ల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. ప్రేక్షకుల్లో సుమన్ శెట్టికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆయన నామినేషన్స్ లోకి వస్తే ప్రేక్షకులు ఆయనను తమ ఓట్లతో టాప్ లో ఉండేలా చేస్తున్నారు. సుమన్ శెట్టి పై అనవసరంగా ఎవరైనా గొడవ పెట్టుకుంటే బయట ప్రేక్షకులు కోపంతో ఊగిపోతున్నారు. అంతలా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు సుమన్ శెట్టి. ఇక, ఇప్పుడు ఆయనకు వంద శాతం అంటూ ఆడియన్స్ హిట్ రేటింగ్ కూడా ఇచ్చేశారు.

- Advertisement -

Read Also: Ramu Rathod: తిన్నా తీరం బడుతలే.. ఏడ్పించేసిన రాము రాథోడ్..!

సుమన్ కు వంద శాతం

నాగార్జున ప్రేక్షకులను హౌస్ లో ఉన్న వారి పేర్లు చెప్తా.. ఈ సీజన్ లో వాళ్లు హిట్టా , ఫ్లాపా అన్నది మీరే డిసైడ్ చేయాలి అని చెప్పారు. దాంతో ప్రేక్షకులు తమ ఓటింగ్ వేశారు. ఆతర్వాత ప్రేక్షకుల ఓటింగ్ చూపించారు నాగ్.. సుమన్ శెట్టికి వంద శాతం హిట్ అంటూ ఓటింగ్ వేశారు ప్రేక్షకులు. ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ కు 95, తనూజాకు 93, కళ్యాణ్ కు 79, రీతూ కి 79, డిమాన్ 72, గౌరవ్ 69, రాము 59, నిఖిల్ 45, సంజన 43, భరణి 35 ప్లేస్ లో ఉన్నారు. టాప్ 6 కు బంపర్ ఆఫర్ ఉంటుంది అని నాగ్ చెప్పారు. టాప్ లో ఉన్న సుమన్ శెట్టిని డైరెక్టర్ కెప్టెన్సీ కంటెండర్ చేశారు.. కానీ అది దక్కాలి అంటే భరణి ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలనీ చెప్పారు. అలాగే తనూజాకు త్వరలో మీ చెల్లి పెళ్లి ఉంది.. ఆమె నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది.. అది కావలి అంటే కళ్యాణ్ మళ్లీ క్యాప్టెన్ అయినా కూడా ఇమ్యూనిటీ ఉండదు సీజన్ మొత్తం అని చెప్పారు నాగ్. ఆతర్వాత రీతూ తండ్రి షర్ట్ ను పంపించి అది నీకు కావాలి అంటే సంజన చీరాలన్నీ స్టోర్ రూమ్ లో పెట్టాలి అని కండీషన్ పెట్టారు నాగ్. చివరిగా ఇమ్మూ గర్ల్ ఫ్రెండ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అది కావాలి అంటే గౌరవ్ దగ్గరున్న బిగ్ బ్లసీ పవర్ పోతుంది అని చెప్పారు నాగ్. దాంతో ఇమ్మూ వాయిస్ మెసేజ్ కావాలి అని చెప్పాడు. దాంతో ఆమె వాయిస్ మెసేజ్ ను వినిపించారు. ఆతర్వాత గౌరవ్ కు, ఇమ్మూకి వాదనజరిగింది.

Read Also: India vs Australia T20: రద్దైన ఐదో టీ20.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అవార్డు ఎవరికి వచ్చిందంటే!

రాము ఎలిమినేట్

ఇకపోతే, బిగ్ బాస్ హౌస్‌లో తెలియని మనుషులు మధ్య రాము రాథోడ్ లాంటి వాళ్లు ఉండటం కష్టమే. అయితే, ఈవారం ఎలిమినేషన్‌కి ముందే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. గత కొన్నాళ్లుగా ఇంటిపై బెంగతో బాధపడుతున్న రాము.. గేమ్‌పై అస్సలు ఫోకస్ పెట్టడం లేదు. అస్సలు ఇన్వాల్వ్ కావడం లేదు. ఒంటరిగా ఏదో పోగొట్టుకున్నవాడిలాగే ఉంటున్నాడు. అతని బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీం.. ఇంటి నుంచి బయటకు పంపించింది. స్టేజ్ పైకి వచ్చిన రాము రాథోడ్ ఆడియన్స్ కు క్షమాపణలు చెప్పాడు. స్టేజ్ మీద కూడా తను ఎక్కుగా మాట్లాడలేదు. అయితే, రాము వెళ్తూ వెళ్తూ ఏడిపించేశాడు. పాట రూపంలో తనలోని బాధ మొత్తం వెళ్లగక్కాడు. నిజానికి బిగ్ బాస్‌కి వచ్చి.. ఇమేజ్‌ని పెంచుకోవడం పక్కనపెడితే.. ఉన్న ఇమేజ్‌ని కాపాడుకోవడం పెద్ద టాస్క్. ఇక్కడికి వచ్చారంటే డబ్బులు బాగానే ఇస్తారు కానీ.. ఉన్న ఇమేజ్‌కి గట్టిగానే డ్యామేజ్ అవుతుంది. అయితే రాము విషయంలో మాత్రం.. పెద్దగా డ్యామేజ్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే.. కాస్తో కూస్తో క్రేజ్ పెరిగింది. తన బిహేవియర్‌‌తో వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. ఓవరాల్‌గా బిగ్ బాస్ జర్నీ.. రాము రాథోడ్‌కి స్వీట్ మెమొరీ అనే అనుకోవచ్చు. ఇది చాలా అరుదుగా లభిస్తుంటుంది. బిగ్ బాస్‌కి వెళ్లి మంచిపేరుతో రావడం అనేది జరగని పని. రాము విషయంలో మాత్రం అది జరిగిందని చెప్పొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad