Bigg Boss Updates: టాలీవుడ్ లో రీరిలీజ్ ల హవా నడుస్తోంది. అయితే, వచ్చేవారం శివ మూవీ రీరిలీజ్ ఉంది. దీంతో శివ మూవీ మేనియాని గుర్తుచేస్తూ.. బిగ్ బాస్ లో ఆ లుక్‌లో హోస్ట్ నాగార్జున కన్పించారు. అంతేకాదు.. బోటనీ పాఠముంది.. మ్యాటనీ ఆట ఉంది అంటూ స్టెప్పులేశారు. శివ మూవీ పాటతోనే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. మరో ట్విస్ట్ ఏంటంటే.. అదే పాటకి ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అంటూ నాగార్జునతో కలిసి ఆయన భార్య అమల కూడా స్టెప్‌లు వేయడం హైలెట్ గా నిలిచింది.
శివ రీ రిలీజ్
36 ఏళ్ల క్రితం ‘శివ’ సినిమాతో అలరించిన నాగార్జున, అమలలు మళ్లీ ఇప్పుడు ఇలా బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించి కనువిందు చేశారు. 36 ఏళ్ల క్రితం మేమిద్దరం శివ సినిమాతో మీ ముందుకు వచ్చాం.. ఇప్పుడు మళ్లీ ఈ నవంబర్ 14న శివ రీ రిలీజ్ చేస్తున్నాం అంటూ ఆడియన్స్‌లో ఎనర్జీని నింపారు. ఆ తరువాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తోనూ మూవీ రీ రిలీజ్‌ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమాలోని పాటలకు డాన్స్ చేయించారు. ఆనందో బ్రహ్మా సాంగ్‌కి తనూజ, కళ్యాణ్‌లు కలిసి డాన్స్ చేశారు. ఇక డీమాన్ పవన్, రీతూలతో రొమాంటిక్ స్టెప్పులు వేయించారు
Read Also: India Pakistan Match: 2028 ఒలింపిక్స్‌లో భారత్-పాకిస్థాన్ పోరు డౌటే!
ఆర్జీవీ ఎంట్రీ
ఇంతలో ఎవరికీ అర్థం కానీ ది గ్రేట్ లెజెంట్, కెప్టెన్ ఆఫ్ ది షిప్ ‘శివ’ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే రాము రాథోడ్ గాలి తీసేశారు ఆర్జీవీ. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి సార్ అంటే.. స్టుపిడ్ క్వశ్చన్ అని పుసుక్కున అనేశారు. ‘రాములోని రాము బయటకు వచ్చారు’ అంటూ నాగార్జున సెటైర్ వేసి కాస్త కూల్ చేశారు. ఇక ఆర్జీవీతో మాట్లాడుతూ.. ‘నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజులు ఉంచితే ఉంటావా? అని నాగార్జున అడిగారు. అందరూ సంజన లాంటి అమ్మాయిలు ఉంటే ఉంటాను అని అన్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ టైమ్‌లో సంజన మొహం చూడాలబ్బా.. ఆహా.. వెలిగిపోయిందనుకో.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. ఐసీసీ కమిటీ ఏర్పాటు
అభిమాని కోరిక తీర్చిన నాగ్..
అయితే రెండు వారాల క్రితం పిఠాపురం నుంచి వచ్చిన ఓ అభిమాని.. శివ సినిమాలో పాటకి డాన్స్ చేయమని నాగార్జునని కోరారు. అప్పుడు సరేనని మాట ఇచ్చారు నాగార్జున. కానీ గతవారం ఆ సాంగ్‌కి స్టెప్ వేయలేదు నాగార్జున. అయితే వచ్చే వారం శివ రీ రిలీజ్ ఉండటంతో అభిమాని కోరికను తీర్చుతూ.. ఆ సినిమాలోని పాటకి స్టెప్ వేశారు నాగార్జున. రియల్ లైఫ్ కపుల్ నాగార్జున, అమలలు ఒకే స్టేజ్ పైన తమ మూవీని ప్రమోట్ చేస్తూ స్టెప్పులు వేస్తే అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారనుకోండి.


