Saturday, November 15, 2025
HomeTop StoriesBigg Boss New Captain: ఆమె కోరింది.. అతడు చేశాడు.. ప్రేమ జంట పంట పండింది.....

Bigg Boss New Captain: ఆమె కోరింది.. అతడు చేశాడు.. ప్రేమ జంట పంట పండింది.. కెప్టెన్ గా డీమాన్ పవన్

Bigg Boss New Captain: బిగ్ బాస్ సీజన్ 9 అంచనాలకు తగ్గట్టుగానే సప్పగా సాగిపోతోంది. ఎందుకూ అంటే.. కామనర్స్ అంటూ ఓ చెత్త బ్యాచ్‌ని హౌస్‌లోకి తీసుకుని రావడంతో ఆట మొత్తం ఎత్తిపోయింది. నిజానికి ఈ సీజన్‌లో అగ్నిపరీక్షను ఎదుర్కోని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ కామనర్సే టైటిల్ ఫేవరేట్ అని అంతా అనుకున్నారు. కానీ.. కనకపు సింహాసనమున శునకమును కూర్చొండబెట్టిన అన్నట్టుగా… ఆరుగురు కామనర్స్ హౌస్‌లోకి వెళ్లారు కానీ.. ఒకర్నిమించి ఒకరు చిరాకు దొబ్బిస్తున్నారు. ఈ కామనర్స్ దెబ్బకి.. టీవీలు కట్టేసే పరిస్థితి రాగా.. ఇప్పుడు ఆ కామనర్స్ నుంచే హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు. అతను ఎవరో కాదు ఢమాల్ పవన్ అలియాస్ డీమాన్ పవన్ . నిన్నటి ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి.. కాళ్లు పట్టుకుని ఈడ్చిపాడేసిన డీమాన్ పవన్.. బిగ్ బాస్ హౌస్‌కి రెండో కెప్టెన్ అయ్యాడు. నాకోసం ఈవారం కెప్టెన్ అవ్వాలి అని ప్రేయసి రీతూ కోరికపై.. నీకోసం ట్రై చేస్తా అని మాటిచ్చాడు ప్రియుడు డీమాన్. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత లవర్స్‌గా మారిన ఈ ఇద్దరి కోరికను నెరవేర్చుతూ డీమాన్ పవన్‌ని బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌ని చేసేశాడు బిగ్ బాస్. మర్యాద మనీష్, భరణి, డీమాన్ పవన్‌, ఇమ్మానుయేల్ ఈ నలుగురూ రెండో వారం కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ పడగా.. వీరికి పెట్టిన ఫిజికల్ టాస్క్‌లో డీమాన్ పవన్ గెలివడంతో అతను హౌస్‌కి రెండో కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Read Also: Bigg Boss Captain: ఎంత పనైపాయే పవనూ..మాటలు వినవ్ అని రీతూ అనేసిందిగా.. కెప్టెన్సీ టాస్క్ లో ఆ నలుగురు

రీతూతో పులిహోర కలపడంలో బిజీ..

డీమాన్ పవన్  కాస్తా ఢమాల్ పవన్ లా మారాడు. వీడెవడో కాటన్ బిజినెస్ చేసే వాడా? అనేలా అతడి పరిస్థితి తయారైంది. అంటే అగ్నిపరీక్షలో గెలిచిన వచ్చిన డీమాన్ పవనే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఢమాల్ పవన్ అయ్యాడు. డీమాన్ ఏంటయ్యా అని అంటే.. వీక్ నుంచి స్ట్రాంగ్ అయ్యే క్యారెక్టర్ సార్ అని బిగ్ బాస్ స్టేజ్‌పై నాగార్జునతో చెప్పిన డీమాన్ పవన్.. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత పరిస్థితి తారుమారైంది. కరువులో ఉన్నట్లు రీతూతో పులిహోర కలిపేస్తున్నాడు. రీతూ చౌదరి వెనుక హచ్ డాగ్ మాదిరిగా వేరెవర్ యూ గో.. యువర్ నెట్ వర్క్ ఫాలోస్ అన్నట్టుగా రీతూ చౌదరి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఆఖరుకి ఆమె అంట్లు తోముతున్నా కూడా వదిలిపెట్టడం లేదు. ఈ ఇద్దరూ కలిసి కసికసి చూపులు పిల్ల చేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు. ఎక్కడ సందు దొరికితే ఇద్దరూ కలిసి అక్కడికి దూరిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్‌ని లవర్స్ పార్క్‌గా మార్చుకున్నారు. సోఫాలో కూర్చుని చేతుపు పిసుక్కుంటూ.. కళ్లల్లోకి కళ్లు పెట్టి కనిపించారు ఈ ఇద్దరూ. అగ్నిపరీక్షలో ఉన్నప్పుడు గోలూ.. గోంగూర కట్టా అని సోది కబుర్లు చెప్పిన డీమాన్ పవన్ కంటికి ఇప్పుడు రీతూ చౌదరి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు.

Read Also: Madonna Sebastian: మత్తెక్కించేలా మడోన్నా సెబాస్టియన్.. చీరకట్లో భలేగా ఉంది

వేరే పని లేకుండా..

రీతూని చూసి బక్కెట్ల బక్కెట్లు సొల్లు కార్చుకోవడం తప్పితే వేరే పనే లేకుండా బిగ్ బాస్ హౌస్‌లో పిల్ల నిబ్బా వేషాలు వేస్తున్నాడు. మనోడికి రీతూ సంగతి తెలియదూ అనుకోవడానికి అవకాశమే లేదు. ఆమె ప్రేమాయణం, పెళ్లి, విడాకులు, లాండ్ స్కాంలు ఇవన్నీ తెలిసినవే. ఇవన్నీ తెలిసినా కూడా.. కంటి చూపుతో డీమాన్ పవన్‌ని గుక్క తిప్పుకోకుండా చేస్తుంది రీతూ. దాంతో మనోడు ఆమె చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు. అంటే.. రీతూకి కెప్టెన్ పగ్గాలు వచ్చినట్టే. ఎందుకంటే.. నీకోసం ఈవారం కెప్టెన్ అవుతానంటూ రీతూ కళ్లల్లోకి కసికసిగా చూసి మరీ చెప్పాడు డీమాన్. అతను అలా అనుకున్నాడో లేదో.. ఇలా కెప్టెన్‌ని చేసేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad