Kaalame OTT Series: కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, ఇంగ్లిష్ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. గతేడాది డిసెంబర్ 27న రిలీజైన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం, పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే ఐఎండీబీలో ఇప్పటికీ ఈ సినిమాకు పదికి 6.9 రేటింగ్ ఉంది. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా సుమారు పది నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
Read Also: Bigg Boss 9 Telugu: అయేషా రీతూని తోమిందయ్యా.. అబ్బబ్బా తోముడంటే ఇదే..!
స్టోరీ ఏంటంటే?
సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కోర్డు డ్రామా. ఓ అమ్మాయి మర్డర్ కేసులో రామస్వామి అనే వ్యక్తి ఇరుక్కుంటాడు. అతనే దోషి అన్నట్లుగా బలమైన సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్షుల్లో ఒకరిగా బిగ్ బాస్ 9 ఫేమ్ తనూజ గౌడ కూడా ఉంటుంది. ఇదే సమయంలో తానేంటో నిరూపించుకోవాలంటూ తపన పడే ఓ లాయర్ ఈ మర్డర్ కేసును టేకప్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రామస్వామిని ఈ మర్డర్ కేసు నుంచి ఆ లాయర్ బయటపడేలా చేశాడా? అసలు ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? అసలు ఆ బాలికకు రామస్వామికి ఉన్న సంబంధం ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కోర్డు సినిమా పేరు లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తనూజతో పాటు మలికిరెడ్డి, ప్రియాంక రెవ్రీ, దయానంద్ రెడ్డి, జయశ్రీ రాచకొండ, ఢిల్లీ గణేష్, వజ్జ వెంకట గిరీధర్, లీలా సాంసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం లీగల్లీ వీర్ సినిమా లయన్స్ గేట్ ప్లే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సినిమా చూసేయండి.
Read Also: Bigg Boss 9 Telugu Day 38: రీతూని వదిలేసిన డీమాన్.. అయేషాతో కెమిస్ట్రీ వర్క్ ఔట్ అవుతుందా?


