Saturday, November 15, 2025
HomeTop StoriesBigg Boss Wildcard Entries: వెల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధం.. ఆ ముగ్గురికే ఛాన్స్..!

Bigg Boss Wildcard Entries: వెల్డ్ కార్డ్ ఎంట్రీలకు రంగం సిద్ధం.. ఆ ముగ్గురికే ఛాన్స్..!

Bigg Boss Wildcard Entries: బిగ్‌బాస్ సీజన్-9 మొదలై మూడో వారం పూర్తి కావస్తోంది. అయితే, గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అంతగా రక్తి కట్టించట్లేదనే చెప్పాలి. ముఖ్యంగా కామనర్లు ఇరగదీస్తారు.. చించి పారేస్తారు అనుకొని ఆడియన్స్ చాలా నమ్మకాలు పెట్టుకొని వాళ్లని అగ్నిపరీక్ష ద్వారా లోపలికి పంపించారు. అయితే కామనర్లు మాత్రం హౌస్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై గట్టిగానే దృష్టి పెట్టింది. ఇప్పుడు ముగ్గురు క్యాండెట్లు కూడా కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. నా గోల్ ఒక్కటే బిగ్‌బాస్ టైటిల్ అంటూ అగ్నిపరీక్షలో ఇచ్చిన హైప్ చూసి జ్యూరీ మెంబర్లు ఏకంగా ఆరుగుర్ని కామనర్లుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించారు. అయితే వీళ్లు అగ్నిపరీక్షలో కనిపించిన విధానానికి.. ఆడిన తీరుకి.. ఇప్పుడు హౌస్‌లో వెలగబెడుతున్నదానికి ఏ మాత్రం సంబంధం లేదు. ప్రియ, దమ్ము శ్రీజ అయితే మరీ ఘోరంగా ఫెయిలయ్యారు. దీంతో వీళ్లు మాట్లాడితేనే ఆడియన్స్ బుర్రలు బాదుకోవాల్సి వస్తుంది. వీళ్లని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గెంటేద్దామా అన్నట్లుగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

పులిహోర పవనాలు..

మరోవైపు బిగ్‌బాస్‌యే నా ధ్యేయం నా ఊపురి అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన ఇద్దరు పవన్ లు (పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్).. రీతూ చౌదరే మా లక్ష్యం అన్నట్లుగా వెనకాల తిరుగుతున్నారు. హౌస్‌లో వీళ్లు చేసే చిల్లర పులిహోర పనులు.. రీతూతో మాట్లాడే సొల్లు కబుర్లు చూసి ఛీఛీ వీళ్లనా మనం ఓటేసి హౌస్‌లోకి పంపింది అంటూ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా మరొక వ్యక్తి హరిత హరీష్. మనోడు మాట్లాడే మాటలు ఆడే తీరు అంతా బానే ఉంటుంది కానీ ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటాడో ఆయనకే తెలీదు. అవతలి వాళ్లని లత్కోర్, రెడ్ ఫ్లవర్ అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడే హరీష్‌ని ఎవరైనా నువ్వు అన్నా సరే మర్యాద మర్యాద అంటూ గొడవేసుకుంటాడు. ఇలా కామనర్లు అయితే టైటిల్ రేసులో కాదు కదా కనీసం హౌస్‌లో కూడా ఉండటం కష్టమే అన్నట్లుగా తయారైంది.

ముగ్గుర్ని వైల్డ్ కార్డులుగా..

దీంతో బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో గట్టిగానే దృష్టి పెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉండి.. కాస్త కాంట్రవర్సీ ఉన్న క్యాండెట్లనే హౌస్‌లో పంపాలని డిసైడ్ అయినట్లున్నారు. ఇందులో భాగంగానే దివ్వెల మాధురి కేరాఫ్ దువ్వాడ శ్రీనివాస్‌ని రంగంలోకి దింపుతుందట. మాధురి ఇప్పటికే బిగ్‌బాస్ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసినట్లు టాక్. అలానే మొదటి నుంచి చెబుతున్న పచ్చళ్ల పాప రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్) కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. రమ్యకి సోషల్ మీడియాలో క్రేజ్ కంటే నెగెటివిటీనే ఎక్కువ ఉంది. దీంతో హౌస్‌లోకి వచ్చి తానేంటో నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం అని భావిస్తుందట. మరోవైపు ఈ ఇద్దరూ కాకుండా సీరియల్ నటి సుహాసిని కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా రాబోతున్నట్లు టాక్. దేవత, మామగారు సహా ఎన్నో సీరియల్స్‌లో హీరోయిన్‌గా చేసిన సుహాసినికి ఫ్యాన్ బేస్ బానే ఉంది. అయితే హౌస్‌లో గొడవలు పెట్టుకునేంత కెపాసిటీ ఉందా లేదా అనేదే డౌట్. ప్రస్తుతానికి అయితే ఈ ముగ్గురూ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. మరో ఇద్దరినీ కూడా కలిపి మొత్తం ఐదుగుర్ని ఐదవ వారంలో హౌస్‌లోకి పంపే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad