Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Written Updates: సినిమా చూపిస్తానని బిగ్ బాస్ వార్నింగ్.. మళ్లీ మనసులు గెలిచిన...

Bigg Boss Written Updates: సినిమా చూపిస్తానని బిగ్ బాస్ వార్నింగ్.. మళ్లీ మనసులు గెలిచిన ఇమ్మాన్యూయేల్..!

Bigg Boss Written Updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ హోరు రసవత్తరంగా మారింది. రీతూకి చికెన్ ముక్కల ఆశ చూపించి సీక్రెట్లు రివీల్ చేయమన్నాడు. ఆ తర్వాత అందరి సీక్రెట్లు చెప్పమంటే.. చేతకాక సాయంత్రం దాకా టైం అడిగింది. ఇక, ఆ తర్వాత అందర్నీ గార్డెన్ ఏరియాకి పిలిచి అక్కడ ఏర్పాటు చేసిన ఆపిల్ చెట్టు ముందు నిల్చోమన్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి.. ఈ రెండు వారాలుగా నేను నా ఇంట్లో మీ ఆటలు మీ నవ్వులు మీ గొడవలు అన్నింటినీ గమనిస్తున్నాను.. ఈ సీజన్ మొదట్లోనే నేను మాటిచ్చాను.. కేవలం కృష్టుడిలా పక్కనుండి మీకు దారి చూపించడమే కాదు అర్జునిడిలా రణరంగంలోకి దిగుతానని.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది.. నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆటని నా చేతుల్లోకి తీసుకోపోతున్నాను.. శనివారం నాగార్జునతో మీకు ఎదురైన అనుభవం కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఈ రాబోయే వారం నేను మీకు చూపిస్తాను..అంటూ బిగ్‌బాస్ వార్నింగ్ టోన్ తో అన్నాడు.

- Advertisement -

మూడు కలర్ సీడ్స్

ఇప్పుడు జరగబోయేది మీ ఊహకి మించి ఉండబోతుంది.. ఎందుకంటే ఇది మీ నామినేషన్స్, కంటెండర్ షిప్, కెప్టెన్సీ, ఇంకా ఎవరు ఈ ఇంట్లో ఉండాలి అన్నదానిపై కూడా ప్రభావం చూపిస్తుంది.. ఈ ప్రయాణం మొదట్లో మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు ఫలాలుగా మారి ఈ చెట్టుపై వేలాడుతున్నాయి.. ఇందులోని కొన్ని పళ్లు మీరు పడ్డ కష్టం..శ్రమ ఫలితంగా తీపిగా మారాయి.. ఇంకొన్ని పళ్లు మీరు ఊహించని రుచితో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.. ఈ రెండు వారాల మీ ఆట చూశాక ఏ ఫలం ఎవరికి దక్కాలో నేను నిర్ణయించాను.. ఇంటి సభ్యులంతా మీ పేరున్న ఫలాన్ని తీసుకోండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

యాపిల్స్ మార్చుకున్న ఆ ముగ్గురూ

ఇంటి సభ్యులందరూ మీ దగ్గరున్నఫలాన్ని తెరిచి చూడండి.. అందులోని విత్తనం మీ భవిష్యత్తుని సూచిస్తుంది.. నేను ఇచ్చిన ఫలాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే వాటిని మార్చుకోవచ్చు.. ఇది మీకు లభించే ఒకే ఒక్క ఛాన్స్.. మార్చుకోవాలనుకునేవారు ముందుకు రండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రీతూ, ప్రియ, శ్రీజ ముగ్గురూ మార్చుకుంటామంటూ ముందుకొచ్చారు. దీంతో మీ దగ్గరున్న పళ్లని చెట్టు దగ్గర వదిలేయండి.. మీ కోసం నేను స్టోర్ రూమ్ నుంచి పళ్లని పంపిస్తున్నాను తలా ఒకటి తీసుకోండి.. మీ దగ్గరున్న పళ్లలో ఉన్నదే ఇక ఫైనల్.. ఒకో రంగు విత్తనం దేన్ని సూచిస్తుందో సమయం వచ్చినప్పుడు నేనే తెలియజేస్తాను..అని బిగ్‌బాస్ అన్నాడు. ఇక వాళ్లు తీసుకున్న ఫ్రూట్స్‌ని కూడా ఓపెన్ చేయగా మొత్తం మూడు రంగుల సీడ్స్ అందరికీ పంచిపెట్టారన్నమాట. దాని ప్రకారం ఎవరు ఏ టీమ్‌లో ఉన్నారంటే.

  • భరణి, హరీష్, రాము, పవన్ కళ్యాణ్, డీమాన పవన్‌ (రెడ్ టీమ్)
  • ఇమ్మూ, తనూజ, సంజన, సుమన్ శెట్టి, ప్రియ (బ్లూ టీమ్)
  • ఫ్లోరా, రీతూ, శ్రీజ (బ్లాక్ టీమ్)

ఫ్యామిలీ నుంచి లెటర్స్, మెమోరీస్

కాసేపటికి బిగ్‌బాస్ మళ్లీ అనౌన్స్ చేశాడు. బ్లూ విత్తనం లభించిన వారందరికీ ఇప్పుడు నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను.. ఈ అవకాశం ద్వారా ఇంటి నుంచి వచ్చిన కొన్ని సందేశాలను జ్ఞాపకాలను మీ మనసుకి దగ్గరైన కొన్ని విషయాలను మీరు నెమరు వేసుకోగలరు కానీ ఇది లభించాలంటే ఈ రణరంగంలో దీని కోసం కూడా మీరు పోరాడాల్సి ఉంటుంది.. అది మీ తోటి సభ్యులతోనే ఇక్కడ ఏది పొందాలన్నా మీరు మూల్యం చెల్లించాల్సిందే.. అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది.. దేని ఖరీదు ఎంతో సమయం వచ్చినప్పుడు మీకే తెలస్తుంది .. ఈ అవకాశం పొందాలంటే డోర్ బెల్ సౌండ్ వినిపించినప్పుడు ముందుగా బజర్ నొక్కాల్సి ఉంటుంది.. అప్పుడు మీరు ఎంచుకున్న విషయం అనుగుణంగా బ్యాటరీ తగ్గుతుంది.. గుర్తుంచుకోండి ఎంతమందికి ఈ అవకాశం లభిస్తుంది అన్న విషయం మీ నిర్ణయంపై మాత్రమే కాదు ఇతరులు తీసుకునే నిర్ణయంపై కూడా ఆధారపడి ఉంటుంది.. కాపట్టి బ్యాటరీ ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఈ అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు.. అంటూ బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.

Read Also: National Film Awards: ఘనంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుక.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

మళ్లీ ఇమ్మానుయేల్

ఇక ఫస్ట్ టైమ్ బజర్ ఇమ్మానుయేల్ కొట్టాడు. దీంతో ఇమ్మూని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మూడు ఆప్షన్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీ నాన్న దగ్గరి నుంచి ఒక లెటర్ వచ్చింది.. అది కావాలంటే బ్యాటరీలో 45 శాతం ఖర్చు చేయాలి.. రెండోది మీ అమ్మ దగ్గరి నుంచి ఒక ఆడియో మెసేజ్ వచ్చింది.. అది కావాలంటే 35 శాతం బ్యాటరీ తగ్గుతుంది. ఇక చివరిగా మీ ఫ్యామిలీ ఫొటో ఉంది అది కావాలంటే 25 శాతం బ్యాటరీ ఖర్చు చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో తప్పక అందరికీ అవకాశం రావాలని తక్కువ బ్యాటరీ ఖర్చు అయ్యే ఫొటోనే సెలక్ట్ చేశాడు ఇమ్మూ. దీంతో కాస్త ఎమోషనల్ అయ్యాడు. కాసేపటికి ఇమ్మూకి ఫ్యామిలీ ఫొటో పంపించాడు బిగ్‌బాస్. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మిగిలిన వాళ్లలో ఎవరికి అవకాశం దక్కిందో.. ఎవరికి దక్కలేదో చూసేందుకు తర్వాతి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Also: Bigg Boss Elimination: అరె ఏంట్రా మరీ ఈ రేంజులోనా రివేంజు.. రివర్స్ ఓటింగ్.. టాప్ లో లక్స్ పాప

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad