Bigg Boss Written Updates: బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ లో నాగ్ జూలు విదిల్చారు. ఓనర్స్ అంటూ తెగ ఫీలైపోయిన కామనర్స్ తాట తీశారు. డీమాన్ పవన్ కెప్టెన్సీ గురించి హౌస్ మేట్స్ అభిప్రాయం తెలుసుకున్నారు. అందరూ అతడు కెప్టెన్సీకి అర్హుడు కాదని తేల్చిచెప్పారు. దీంతో.. అప్పుడు మహానటి రీతూని లేపి అడిగారు. దాంతో ఆమె.. ‘నా ప్రకారం.. నాకు ఏది కనిపిస్తే అది చెప్పాను. నాకు ఉన్నవి రెండు కళ్లు.. బాడీ మొత్తం కళ్లు లేవు కదా. నాకు డీమాన్‌కి ఎవరైనా రాస్తుంటే కనిపించేది తప్ప.. అతను ఎవరికైనా రాస్తుంటే కనిపించేది కాదు. వీడియో చూడకముందు వీళ్లకి నేను చేసింది రైట్ అనిపించింది. వీడియో చూశాక తప్పనిపిస్తుంది. నాకు డీమాన్‌పై సాఫ్ట్ కార్నర్ లేదు. ఆ వీడియోలో కూడా.. అప్పటికి నేను సంచాలక్ కాలేదు. దానికంటే ముందు నేను కెప్టెన్ అవ్వాలని అనుకున్నా. నేను జెన్యూన్‌గానే ఉన్నాను. వాడ్నే గెలిపించాలని చేయలేదు. నా మనసులో ఏముందో నాకు తెలుసు సార్’ అని చెత్త కబుర్లు అన్నీ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి.
రీతూ.. రాంగ్ చేసింది సార్..
ఆహా.. ఔనా.. మరి కెప్టెన్సీ పోటీదారుల రేస్ వచ్చేసరికి డీమాన్ పవన్‌ని పుష్ చేసింది ఎవరూ అని రీతూని నాగ్ అడిగారు. ‘నేనే సార్.. ముందు నుంచీ నేను అదే అనుకున్నా.. సంచాలక్‌గా అయ్యాక కాదు’ అని చెప్పింది రీతూ. సరే అయితే స్టుడియోలో ఆడియన్స్ ఉన్నారు.. వాళ్లకేం అనిపించిందో చూద్దాం అంటూ వాళ్ల అభిప్రాయాన్ని అడిగారు. ‘రీతూ రాంగ్ నిర్ణయం తీసుకుంది సార్.. వెంటనే ప్రియ, శ్రీజా, మనీష్‌లు శాడిష్టులుగా బిహేవ్ చేశారు. టెనెట్స్ కి అన్యాయం జరిగింది. లేదంటే భరణి, ఇమ్మానుయేల్‌లలో ఎవరో ఒకరు కెప్టెన్ కావాల్సింది అని అన్నది.
అక్క లేచిందయ్యో..
అది విన్న నాగార్జున.. ఇప్పుడేమంటావ్ రీతూ అని అన్నారు. ‘యాక్సెప్ట్ చేస్తారా.. వాళ్లు ఫీల్ అయితే సారీ.. నా వల్ల తప్పు జరిగింది కాబట్టి.. అని అన్నది. దాంతో నాగార్జున.. ‘సంచాలక్ అంటే ఒక బాధ్యత.. కంటెస్టెంట్స్‌కి అన్యాయం జరుగుతుందంటే ప్రశ్నించండి.. మీకోసం మీరు నిలబడండి’ అని అన్నారు నాగార్జున. ఇంతలో ప్రియా శెట్టి మధ్యలో అందుకుంది. దాంతో నాగార్జున మళ్లీ మొదలుపెట్టేశావా? అని అన్నారు. సార్.. మేం రియాక్ట్ అయ్యాం అని అంటున్నారు కదా సార్.. గేమ్ జరుగుతున్నప్పుడే మా రియాక్షన్ వస్తుంది’ అని చెప్పింది.
ప్రియాని చూసి లేచిన శ్రీజ
Read Also: Viral Video: పగవాడికి కూడా ఈ కష్టం రావద్దయ్యో.. ఎలుక కోసం పాము పడిన పాట్లు చూస్తే నవ్వుకోవాల్సిందే
ఆ వెంటనే శ్రీజా కూడా లేచింది. దాంతో నాగార్జునకి మండింది. ఒక్కర్ని అడిగితే.. ఇంకొకరు రియాక్ట్ అయిపోయి.. సన్నాయి నొక్కులు స్టార్ట్ చేస్తారు.. ఎంతసేపూ థూ థూ థూ అంటూ వెధవ సోది.. ఒక్కరు మాట్లాడండి అని క్లాస్ పీకారు. అయినా సరే.. ‘నేను ఆ మాట అనడంలో తప్పేం ఉంది సార్’ అంటూ మూతిని ముప్పై వంకర్లు తిప్పింది. దాంతో నాగార్జున.. ‘భరణి.. ఇమ్మానుయేల్‌ని ఎంత సేపు ఆపాడు.. అంటే నీకు మంచి జరిగితే ఫెయిర్.. నీకు మంచి జరగకపోతే అన్ ఫెయిర్. ఒక ఆటగాడి ఆట గురించి నువ్వు ఎలా చెప్తావ్. వాళ్ల ఆటకూడా నువ్వు ఆడేస్తావా? వాళ్లు ఫెయిర్ వీళ్లు అన్ ఫెయిర్ అంటున్నావ్ కదా.. ఇంతకీ సంచాలక్‌గా నువ్వు ఫెయిర్‌గా ఉన్నావా? అని అడిగారు.
యస్ సర్ అన్న ప్రియ
హా యస్ సార్ అంటూ ఆ బొంగురు గొంతుతో మరీ చెప్పింది ప్రియ. సరే చూడు అంటూ వీడియో చూపించారు నాగార్జున. ఆ వీడియో చక్రం ఆటలో కళ్యాణ్.. మిస్టేక్ చేశాడు. తనూజ కళ్యాణ్ ఔట్ అని అరుస్తున్నా కూడా సంచాలక్‌గా ఉన్న ప్రియాశెట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పమ్మా.. అని నాగార్జున అడగ్గా.. ‘అన్ ఫెయిర్ సార్.. రీజన్ చెప్పుకోవాలని లేదు’ అని అన్నది. అక్కడ అసలేం ఉంది రీజన్ చెప్పడానికేం ఉంది.. బొక్క తప్ప..క్లియర్ గా దొరికిపోయిందిగా.. అందుకేనేమో నాగార్జున అన్నారూ.. ఏంటీ రీజన్ చెప్పవా అని. ఐయామ్ నాట్ ఫెయిర్ సార్ అని ఆమెనోటితోనే చెప్పించారు నాగార్జున.
డీమాన్ కెప్టెన్సీ క్యాన్సిల్..
ఆ తర్వాత ..ఏంటి కేప్టేన్ డీమాన్.. ఇన్ని మిస్టేక్‌లు చేస్తే నువ్వు కెప్టెన్ అయ్యావ్..ఈ ప్రాసెస్ కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? అనిఅడిగారు. ‘లేదు సార్.. నాకు కెప్టెన్ వద్దు’ అని అన్నాడు డీమాన్ పవన్. దాంతో నాగార్జున.. ‘నీ కెప్టెన్సీని రద్దు చేస్తున్నా.. అనిఅన్నారు. ఆ మాట అనగానే.. రీతూ తల దించేసుకుని తెగ బాధపడిపోయింది. నేను కెప్టెన్ చేయాలని అనుకోలేదని చెప్పిన ఈ అమ్మగారు ఎందుకు తలదించుకుని బాధపడిపోయిందో ఏమో కానీ.. నాగార్జున మాత్రం జాడించి వదిలిపెట్టారు. కెప్టెన్సీ పోటీదారులైన ఆ నలుగురికీ మళ్లీ టాస్క్ పెడతాం.. రీతూ చౌదరే సంచాలక్‌గా ఉంటుంది అని అన్నారు.
ఇది కరెక్ట్ కాదు సార్..
అతని కెప్టెన్సీ బ్యాడ్జ్‌ని తీసేసి స్టోర్ రూంలో పెట్టండి అని అన్నారు నాగార్జున. ఇంతలో శ్రీజ నేనున్నానంటూ చేయి ఎత్తి పైకి లేచిందీ. ఏంటమ్మా నీ బాధ అంటే.. ‘సార్ అక్కడ ప్లేయర్ తప్పు చేయలేదుకదా.. సంచాలక్ తప్పు చేసింది.. దానికి ప్లేయర్ కెప్టెన్సీని తీసేయడం కరెక్ట్ కాదు అని అన్నది. దాంతో నాగార్జున.. ‘కెప్టెన్ అయిన పవన్ ఫెయిర్‌గా గెలవాలని అనుకుంటున్నాడు.. ఈ గెలుపు వద్దనుకుంటున్నాడు.. ప్రతి విషయంలో థు థు థు అని వస్తున్నావ్’ అంటూ శ్రీజా దమ్ము దుమ్ము దులిపేశారు నాగార్జున. చివర్లో ప్రియ, శ్రిజా, రీతూ, డీమన్ పవన్‌లను రంగుపడిపోయింది.


