Bigg Boss Written Updates: బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ బంధుత్వాలు కలుపుకున్నారు. నిన్నటి దాకా ఉమ్మడి కుటుంబంలా సాగిన షో ఇప్పుడు ముక్కలైంది. భరణి- దివ్యలకు తనూజ ఇచ్చిన షాక్ చూడి అందరూ అవాకయ్యారు. కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ ని గెలిపించేందుకు సపోర్ట్ చేసిన దివ్యనే తనూజ బొక్కబోర్ల పడేసింది. ఇప్పుడు,ఆ వివరాలు చూద్దాం.
సర్వైవరల్ టాస్కులో తనూజ గెలిచింది. కాగా.. సేఫ్ జోన్ లో ఉన్న నలుగురురికి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. సేఫ్ అయిన కంటెస్టెంట్లనే కంటెడర్లుగా తీసుకొని కనుక్కోండి చూద్దాం అనే టాస్క్ పెట్టాడు. పోటీదారులు అందరూ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చొని ఉంటారు. వారి నెత్తిన ఒక బల్డ్ వేలాడుతూ ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు ఛైర్స్‌లో కూర్చున్న పోటీదారుల్లో ఒకరిని ఎంచుకొని వారి భుజంపై టచ్ చేస్తారు. అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్లకి ఉన్న గంతలు తీసి మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి లైట్‌ని ఆఫ్ చేయాలి. వెంటనే తిరిగి తమ ఛైర్‌లో కళ్లకి గంతలు కట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత అందరూ గంతలు ఓపెన్ చేస్తారు. ఎవరి లైట్ అయితే ఆఫ్ చేసి ఉంటుందో వారు.. ఇది చేసిందెవరో గెస్ చేయాలి. వారు గెస్ చేసిన సభ్యులు లైట్ ఆఫ్ చేసిన సభ్యులు ఒకరే అయితే ఆ లైట్ ఆఫ్ చేసిన సభ్యులు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నమాట.
సంచాలక్ గా సంజన
ఈ టాస్క్‌కి సంజన సంచాలకురాలిగా ఉంది. ముందుగా రాము ఈ టాస్క్ నుంచి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కళ్యాణ్ కనిపెట్టేయడంతో భరణి కూడా తప్పుకున్నాడు. నెక్ట్స్ తనూజకి సంజన అవకాశం ఇచ్చింది. తనూజకి వెళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసింది. ఇక గంతలో ఓపెన్ చేయగానే తనూజ మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ ఆఫ్ చేసి ఉంటాడని దివ్య చెప్పింది. మీరు సంచాలక్‌గా ఉన్నప్పుడు ఇమ్మానుయేల్‌ని ముందు రిస్క్‌లో పెట్టరు.. తనూజ నాకు తీయదు అనిపిస్తుంది.. సో కళ్యాణ్ అంటూ చెప్పింది దివ్య. ఇది రాంగ్ అవ్వడంతో ఆమె ఎలిమినేట్ అయింది. తర్వాత సంజన తింగరిగా వెళ్లి ఇమ్మూకి అవకాశం ఇచ్చింది. దీంతో ఇమ్మూ తనూజది ఆఫ్ చేయగానే తనూజ కరెక్ట్‌గా గెస్ చేసి ఇమ్మూ అని చెప్పేసింది. ఎందుకంటే కళ్యాణ్- తనూజ ముందే ఒక ఒప్పందం చేసుకున్నారు. నేను నీది ఆఫ్ చేయను నువ్వు నాది ఆఫ్ చేయకు అనుకున్నారు. సో ఇమ్మూ ఔట్ అయిపోయాడు.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ లోకి నాగార్జునకు హిట్ ఇచ్చిన దర్శకుడు.. ఫుల్ ఇంట్రెస్టింగ్ గా మారిన షో
కెప్టెన్ గా కళ్యాణ్…
ఇక రేసులో మిగిలిన తనూజ-కళ్యాణ్‌లలో కెప్టెన్ ఎవరు కావాలో డిసైడ్ చేసే పవర్ డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. డేంజర్ జోన్‌లో ఉన్న సభ్యులందరూ వీళ్లిద్దరిలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదనుకుంటే వాళ్ల లైట్ ఆఫ్ చేయండి.. అని బిగ్‌బాస్ అన్నాడు. అందులో డీమాన్, రీతూ, శ్రీజ.. కళ్యాణ్‌కి సపోర్ట్ చేయగా సుమన్, సంజన మాత్రమే తనూజకి మద్దతు ఇచ్చారు. దీంతో కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కెప్టెన్‌గా కళ్యాణ్ పడాల.. మేమంతా వెనక పడాల అంటూ రీతూ తెగ పొంగిపోయింది. వెళ్లి హగ్గు కూడా ఇచ్చేసింది.
అంతా అయిపోయాక సారీ..
ఇక అంతా పాయే అయిన తర్వాత దివ్య దగ్గరికెళ్లి సారీ చెప్పింది తనూజ. సారీ దివ్య.. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు.. ఇంకెప్పుడూ ఇలా చేయను అంటూ తనూజ బతిమాలింది. లేదు నువ్వు మోసం చేశావ్.. నీ ఆట నువ్వు ఆడతా అనుకున్నప్పుడు ముందు వచ్చి నాతో ఎందుకు అలా చెప్పావ్.. ఇద్దరం కలిసి ఆడదామని.. అంటూ దివ్య కొశ్చన్ చేసింది. అంటే నువ్వు వచ్చి 2 వారాలే అయింది.. కళ్యాణ్ ఐదు వారాలుగా ఉన్నాడు నాతో సో అందుకే అంటూ తనూజ ఆన్సర్ ఇచ్చింది. ఇది నమ్మించి మోసం చేయడమే అంటూ దివ్య.. తనూజకి చెప్పింది.
వామ్మో కళ్యాణ్ స్ట్రాటజీ మామూలుగా లేదు గా..
కళ్యాణ్ కెప్టెన్ కావడంతో బిగ్‌బాస్ అభినందనలు తెలిపాడు. ఎప్పటిలానే ప్రస్తుతం ఉన్న కెప్టెన్ తన చేతికి ఉన్న బ్యాండ్ కొత్త కెప్టెన్‌కి కడతాడు. అయితే రాము కట్టడానికి వస్తే కళ్యాణ్ వద్దు.. దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానని చెప్పాడు. ఇదేంటి దివ్యతో ఎందుకు అని అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. సరే అడిగాడు కదా అని దివ్య కూడా కట్టేసింది. కానీ ఎందుకు అన్నది తర్వాత శ్రీజ-కళ్యాణ్ తనూజకి చెప్పారు. ఆమె కళ్యాణ్‌ని వరస్ట్ ప్లేయర్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆమె చేతే కెప్టెన్ బ్యాండ్ కట్టించుకున్నాడు అని శ్రీజ చెప్పింది.
Read Also: Bigg Boss Written Updates: ఈ తింగరిది ఎక్కడ్నుంచి వచ్చిందిరా బాబు.. కళ్యాణ్-శ్రీజ బుట్టలో పడ్డ తనూజ
తనూజ ఆట చూసి చిరాకు..
మరోవైపు తనూజ ఆడిన ఆట చూసి ఇమ్మూ, భరణి, దివ్యలకి చిరాకొచ్చింది. ఇది కరెక్టేనా.. నేను అసలు తనూజని ఎప్పుడూ నమ్మను కానీ మీ వల్ల నమ్మాల్సి వచ్చింది.. కానీ ఏం చేసిందో చూశారా అని భరణితో చెప్పింది దివ్య. అవును అసలు ఇది కరెక్ట్ గేమ్ కాదు అని భరణి కూడా అన్నాడు. తర్వాత నైట్ ఇమ్మూ-భరణి మధ్య డిస్కషన్ నడించింది. అన్నా తనూజ ఆట నాకు అసలు అర్థం కావడం లేదు.. కళ్యాణ్‌ని మరీ గుడ్డిగా నమ్మేస్తుంది అని ఇమ్మూ అన్నాడు. అవును సేఫ్ అవ్వాల్సిన తను డేంజర్‌కి వెళ్లిందే వాడివల్ల.. పైగా డేంజర్ నుంచి బయటికి తీసుకొచ్చింది మనం.. కానీ కెప్టెన్సీ టాస్కులో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని భరణి అన్నాడు. అసలు, ఈ తింగరి మొహం తనూజ కళ్యాణ్ బుట్టలో ఎలా పడిందో అందరూ షాక్ అవుతున్నారు. ఇక, ఇవాళ్టి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి ఏమైనా తెలుస్తుందో చూడాలి.


