Bigg Buzz: బిగ్ బాస్ నాలుగో వారం ఊహించని ఎలిమినేషన్ అయ్యింది. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత జరిగిన బిగ్ బజ్ ఇంటర్వ్యూలో హరిత హరీష్‌ను ఏకిపారేశారు హోస్ట్ శివాజీ. అతనికి రెడ్ ఫ్లవర్ ఇచ్చి మరీ పుంగి బజాయించారు. అయితే ఆ ఇంటర్వ్యూలో హరీష్ కూడా తగ్గలేదు. మాటికి మాట సమాధానం చెప్పారు. అయితే బిగ్ బాస్‌లో లేపలన్నా.. తొక్కాలన్నా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ బజ్‌లో కూడా హరీష్ మాటకి మాట సమాధానం ఇచ్చినా కూడా.. శివాజీని హైలైట్ చేశారు. అయితే, ఈ విషయాన్ని స్వయంగా హరీష్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా, ఈ బజ్ ఇంటర్వ్యూ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
ఆయనకు మర్యాద ఇచ్చా అంతే..
అయితే, శివాజీ తనకి రెడ్ ఫ్లవ్ ఇవ్వడాన్ని తప్పుపట్టిన హరిత హరీష్.. తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. ‘‘శివాజీ గారు హోస్ట్ కాబట్టి.. ఆయనకి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడాను. చాలా కంట్రోల్‌గానే ఉన్నాను. అదే ప్లేస్‌లో వేరే వాళ్లు ఉండి ఉంటే.. కథ వేరేలా ఉండేది. ఆయన నాకు ఇచ్చిన రెడ్ ఫ్లవర్స్ ఉన్న రేఖలు మొత్తం ఊడగొట్టేవాడ్ని. ఆ లెవల్‌లో ఉండేది. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. బిగ్ బాస్ బజ్‌లో శివాజీ గారు నాకు రెడ్ ఫ్లవర్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే వాళ్లకి అలా అర్థం అయ్యింది. అందుకే అలా చేశారు. నేను ఇమ్మానుయేల్‌ని రెడ్ ఫ్లవర్ అని అన్నా కూడా ఇంత బాధపడేవాడ్ని కాదు. నేను కొరియర్ బాయ్‌లా పనిచేయడం వల్ల రెడ్ ఫ్లవర్ ఇష్యూ వచ్చింది. ముందు వెనుక కట్ చేసి.. అనని దాన్ని అన్నట్టుగా చూపించారు. బయట నుంచి చూసింది వేరు.. లోపల జరిగింది వేరు. దాన్ని బట్టి నాపై బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు మీడియా వాళ్లు హుందాగా ఉండాలి కదా..” అని చెప్పుకొచ్చాడు.
గుండు అంకుల్ కామెంట్ పై..
గుండు అంకుల్ అనే కామెంట్ పైనా హరీష్ స్పందించారు. ‘ఒక గెస్ట్‌గా పిలిచినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా.. గుండు అంకుల్ అంటే ఎందుకు బాధపడుతున్నారి.. ఒకామె అడిగింది. ఆమెకి బాధ తెలియాలనే బండ ఆంటీ అని అన్నాను. అప్పుడు ఆమె వెంటనే రియాక్ట్ అయ్యింది. నేను కావాలని చేయలేదు.. సారీ కూడా చెప్పాను. నేను ఆమెను అన్నానంటే మా తల్లిని అన్నట్టే. నాకు నచ్చని విషయం ఉందంటే ఖచ్చితంగా నచ్చలేదని చెప్తాను. నాగార్జున గారి ముందు కూడా అలాగే ఉన్నాను. ఇప్పుడు నేను వీళ్ల గురించి మారానంటే.. పుట్టనప్పటి నుంచి జర్నీ చేసిన మా తాత, నాన్నలు ఫీల్ అవుతారు. దేవుడు వచ్చినా కూడా.. చెప్పాలనుకున్నది చెప్పగలగాలి. ఉప్పు కారం తింటున్నాం కదా. కానీ ఇవ్వాల్సిన వాళ్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నాగార్జున గారంటే ఆయన పెద్దాయన కాబట్టి.. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చాను. చెప్పాల్సిన విషయం చెప్పాను. నాగార్జున గారి ముందు ఎలా ఉన్నానో.. శివాజీ గారి ముందు అలాగే ఉన్నాను. వాళ్లకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చారు హరిత హరీష్.
Read Also: Bigg Boss Promo Today: నాకేం చెప్పకు.. వామ్మ ఈ కళ్యాణ్-తనూజ లొల్లి ఏందో ఏందో?
పేలిన రెండు ఇంటర్వ్యూలు
శివాజీ బిగ్ బాస్ బజ్ తొలి రెండు ఇంటర్వ్యూలు చప్పగా సాగాయి కానీ.. కానీ ప్రియశెట్టి, హరిత హరీష్ ఇంటర్వ్యూలు మాత్రం బాగా పేలాయి. ముఖ్యంగా హరిత హరీష్‌కి రెడ్ ఫ్లవర్ ఇచ్చి.. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటూ సెటైర్లు వేస్తూనే రెడ్ ఫ్లవర్‌తో స్వాగతం పలికిన శివాజీ.. ‘నీ దగ్గర మ్యాటర్ ఏం లేదు.. అంతా డొల్లా.. సెల్ఫ్ డబ్బా.. బిగ్ బాస్ ఎంత తోపునైనా వొంగోబెట్టి పుంగి బజాయిస్తుందంటూ హరిత హరీష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు శివాజీ. అయితే, గతంలో శివాజీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు.. స్పై అంటూ పల్లవి ప్రశాంత్, యావర్‌లతో గ్రూప్ కట్టి ఆడటాన్ని తప్పు పట్టారు హరీష్. ఆయన అలా ఆడటం నాకు నచ్చలేదు. గ్రూప్‌గా గేమ్ ఆడటం అదే ఆట అంటూ విమర్శించారు హరీష్. మరి అవన్నీ మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ.. ఎలిమినేట్ అయ్యి బజ్ ఇంటర్వ్యూకి వచ్చిన హరిత హరీష్‌ని పుంగి బజాయించారు శివాజీ.


