Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Bigg Boss Sreeja: భరణి కోసం నన్ను బలి పశువును చేశారు

Bigg Boss Sreeja: భరణి కోసం నన్ను బలి పశువును చేశారు

Bigg Boss Sreeja: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పుడూ లేనంత సప్పగా సాగుతోంది. గత వారం రీఎంట్రీ అంటూ పెద్ద తతంగమే నడిచింది. దమ్ము శ్రీజ-భరణి ఇద్దరినీ హౌస్‌లోకి రప్పించి.. కొన్ని టాస్కులు పెట్టి హడావిడి చేశారు. ఇక వీరిద్దరిలో ఎవరిని మీరు హౌస్‌లో చూడాలనుకుంటున్నారో ఓట్ చేయండి అంటూ 24 గంటల పాటు పోలింగ్ కూడా పెట్టారు. చివరికి ఈ పోలింగ్‌లో భరణికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ శ్రీజని మరోసారి ఎలిమినేట్ చేశారు. అయితే ఇది చూసిన ఆడియన్స్ ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో శ్రీజని స్టేజ్ మీదకి రప్పించి జర్నీ వీడియో వేసి ప్రాపర్‌గా ఎలిమినేట్ ప్రక్రియ పూర్తి చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటిది జరగలేదు. దీంతో, నా ముఖానికి ఏవీ కూడా వేయకుండానే బయటికి పంపేశారంటూ బిగ్‌బాస్ టీమ్‌పై నిప్పులు చెరిగింది దమ్ము శ్రీజ. అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ వరకూ తన జర్నీ ఎలా సాగింది.. తనని బిగ్‌బాస్ టీమ్ ఎలా తొక్కేశారో వివరిస్తూ ఓ వీడియోని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది శ్రీజ.

- Advertisement -

Read Also: Bigg Buzz: శివాజీకి ఝలక్‌లు, కౌంటర్‌లు, డైలాగ్‌లు.. మాధురి ఫుల్ ఫైర్!

భరణికి ఎలా రీఎంట్రీ ఇస్తారు?

బిగ్‌బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఓటింగ్‌తో సంబంధం లేకుండా వైల్డ్ కార్డ్స్ ఇష్టంతో తనని ఎలిమినేట్ చేశారని శ్రీజ చెప్పింది. అసలు ఓటింగ్‌లో టాప్-3లో ఉన్న నన్ను అలా ఎలిమినేట్ చేయాలని ఎందుకు అనిపించిందో అంటూ శ్రీజ ప్రశ్నించింది. అది అప్పటికప్పుడు వాళ్లు తీసుకున్న నిర్ణయం అని అందుకే ఏవీ కూడా తనకి వేయలేదని శ్రీజ ఆరోపించింది. “నన్ను ఎలిమినేట్ చేసిన విధానం నాకు చాలా బాధగా అనిపించింది. స్టేజ్ మీదకి నేను వెళ్లేవరకూ కూడా నాకు ఏం అర్థం కాలేదు. ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారేమో నన్ను ఏమైనా సీక్రెట్ రూమ్‌లో పెడుతున్నారేమోనని అనుకున్నాను. కానీ వెంటనే బజ్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి షాకిచ్చారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. తర్వాత బిగ్‌బాస్ ఎపిసోడ్స్ కూడా ఏం చూడలేదు. కానీ మళ్లీ బిగ్‌బాస్ టీమ్ వాళ్లే ఇలా నామినేషన్స్ చేయాడానికి హౌస్‌లోకి వెళ్లాలి రమ్మని పిలిచారు. వెళ్లేవరకూ కూడా మాకు రీఎంట్రీ ఉందని చెప్పలేదు.” అని చెప్పింది.

Read Also: Deepti Sharma: ఎన్నో అవమానాలు దాటుకొని..ప్రపంచ కప్‌ వరకు!

రీఎంట్రీ ఉంటుందని..

అంతేకాకుండా, ఆ తర్వాత హోటల్‌లో ఉండగా రీఎంట్రీ ఉంటుందని చెప్పినట్లు శ్రీజ తెలిపింది. “కానీ తీరా స్టూడియోకి వెళ్లాక అక్కడ భరణి గారు కూడా ఉండటం చూసి షాకయ్యా. ఎందుకంటే నన్ను ఆడియన్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారు.. అందుకే నన్ను పిలిచారు అనుకున్న. కానీ భరణి గారిని ఎందుకు రీఎంట్రీకి పిలిచారు. అలా అయితే మిగిలిన వాళ్లని కూడా పిలవాలి కదా. పైగా నేను, భరణి గారు హౌస్‌లోకి వెళ్లేటప్పుడు అక్కడ గేటు ఓపెన్ చేసే వాళ్లు భరణి గారికి ఒక హింట్ కూాడా ఇచ్చారు. ముందులా కాదు ఈసారైనా గేమ్ బాగా ఆడండి.. మీరు ఉంటారు కాబట్టి అన్నారు.. అప్పుడే నేను అనుకున్నా ఏదో ఒకటి చేసి నన్ను పంపించేస్తారని అలానే జరిగింది. నా ఎలిమినేషన్ వల్ల బిగ్‌బాస్‌పై వచ్చిన మరకని వదిలించుకోవడానికే నన్ను మళ్లీ పిలిచి నాటకం ఆడారు. కేవలం భరణి రీఎంట్రీ కోసం నన్ను బలిపశువును చేశారు. కనీసం రెండోసారి కూడా ఎలాంటి ఏవీ లేకుండా నన్ను పంపించేశారు. ఇది న్యాయమా. నేను కోరుకునేది ఒక్కటే నా జర్నీ వీడియో మాత్రం ఇవ్వండి చాలు” అంటూ ఎమోషనల్ అయింది శ్రీజ.

 

View this post on Instagram

 

A post shared by Srija Dammu (@srija_sweetiee)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad