Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Divvala Madhuri: రెమ్యూనరేషన్ గురించి దివ్వెల షాకింగ్ కామెంట్స్

Divvala Madhuri: రెమ్యూనరేషన్ గురించి దివ్వెల షాకింగ్ కామెంట్స్

Divvala Madhuri: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన దివ్వెల మాధురి గత వారం ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఆమె హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటారని చాలామందికి ఆమె హౌస్‌లో ఎక్కువ రోజులు ఉంటారని అనిపించాయి. కానీ మూడు వారాల తర్వాతే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మాధురి మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో తన ఆట తీరు మార్చేసింది. మొదట్లో గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మాధురి.. ఆ తర్వాత తన ఆట, మాట తీరుతో జనాలకు దగ్గరయ్యింది. అదేసమయంలో ఊహించని విధంగా హౌస్‌కు వెళ్లిన మూడు వారాల్లోనే బయటికి వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, మాధురి వరుసగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అంతేకాకుండా, తన బిగ్ బాస్ జర్నీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

- Advertisement -

Read Also: Bigg Boss Nominations: ఓటింగ్ లో మళ్లీ ఆమే టాప్..!

రెమ్యూనరేషన్ గురించి..

ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె రెమ్యునరేషన్ విషయంలో చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయినా మాధురి భారీగా పారితోషకం పొందారని రూమర్లు వినిపించాయి. కొన్ని వార్తల ప్రకారం, మూడు వారాల పాటు ఆమెకు మొత్తం 9 లక్షల రూపాయల రిమ్యునరేషన్ వచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై మాధురి పూర్తి క్లారిటీ ఇచ్చారు. “బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని దువ్వాడ శ్రీనివాస్ ముందు నుంచే చెప్పారు. ఆయనకు డబ్బుపై ఆసక్తి పెద్దగా లేదు. మేము సినిమా చేస్తే కూడా, ఆ ఫిల్మ్‌కి పారితోషికం తీసుకోలేదు. ఫ్రీగానే నటించాము” అని మాధురి తెలిపారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ, ఆమె నిజాయితీ, సింప్లిసిటీపై పలువురు ఫ్యాన్స్ ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Divvala Madhuri: నేను అన్నీ వదిలేస్తా.. ఆమె ట్రోఫీ వదిలేస్తుందా?

దువ్వాడ ఇంటర్వ్యూ వైరల్

ఇక, ఇంతకుముందు దివ్వెల మాధురి రెమ్యూనరేషన్ గురించి దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఒకవేళ మాధురి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిస్తే, ఆ ప్రైజ్ మనీని దివ్యాంగుల బాగు కోసం వినియోగిస్తానని, అలాగే క్యాన్సర్ బాధితుల కోసం కూడా ఉపయోగిస్తానని తెలిపారు. వీటితో, మాధురి, శ్రీనివాస్ నిజాయితీ, సామాజిక బాధ్యతల్ని నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. అంతేకాకుండా, రెమ్యూనరేషన్ వివరాలు బయటపెట్టాక, సోషల్ మీడియాలో ఆమెను ‘సింపుల్, ఫేర్’ కంటెస్టెంట్ అని ఆమె గురించి వైరల్ అవుతోంది. తక్కువ సమయం మాత్రమే హౌస్‌లో ఉండి కూడా ఆమె ఫుల్ ఇమ్పాక్ట్ చూపించిందని చెప్పుకొస్తున్నారు. కానీ, తక్కువ వ్యవధిలోనే ఆమె ఎలిమినేట్ అవ్వడం జనాలకు షాక్ లాంటిదే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad