Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Madhuri Remuneration: వామ్మో.. నెలకు కోటి రూపాయల సంపాదనా?

Madhuri Remuneration: వామ్మో.. నెలకు కోటి రూపాయల సంపాదనా?

Madhuri Remuneration: బిగ్‌బాస్ హౌస్ లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వెళ్లి మూడు వారాల పాటు ఉన్న దివ్వెల మాధురి రెమ్యూనరేషన్ పై చర్చ జోరుగా జరుగుతుంది.  మొదటి వారం ఎవరూ తనని నామినేట్ చేయలేదు. ఇక రెండో వారం తనూజతో డైరెక్ట్ నామినేషన్ చేయించుకొని హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది. అయితే ఎగ్జిట్ ఇంటర్వ్యూలో శివాజీకి మాధురి గట్టిగానే సెటైర్లు వేసింది. మాటకి మాట, పంచుకి పంచు అన్నట్లుగా సాగిన ఈ ఇంటర్వ్యూలో గట్టిగానే పేలింది. ఆ తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్‌కి దువ్వాడ సమేతంగా కొన్నింటికి సింగిల్‌గా కూడా మాధురి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ రెమ్యూనరేషన్ గురించి యాంకర్ అడిగాడు. కొంతమంది బిగ్‌బాస్‌కి ఫేమ్ కోసం వెళ్తారు.. మరికొంతమంది రెమ్యూనరేషన్ కోసం టెంప్ట్ అయి వెళ్తారు.. మీరు ఎందుకు వెళ్లారని యాంకర్ అడిగాడు.

- Advertisement -

Read Also: Yuvraj Singh: బూట్లు ఇచ్చుకుని కొడతా జాగ్రత్త…యువరాజ్‌ ఫైర్‌

నాకే నెలకి కోటి వస్తుంది

దీనికి బదులిస్తూ మాధురి తన ఆదాయం గురించి చెప్పి అందరికీ షాకిచ్చింది. “టెంప్ట్ అవ్వడానికి ఏం లేదు నాకు రోజుకి ఇక్కడే 2-3 లక్షలు వస్తుంది.. నేను టెంప్డ్ అవ్వాల్సిన అవసరం ఏముంది.. షో అంతా ఆడితే కోటి రూపాయలు అయితే నాకు నెలకే కోటి రూపాయలు వస్తుంది. అసలు నేను రెమ్యూనరేషన్‌కి ఏం డిమాండ్ చేయలేదు.. ఎప్పుడూ ఆశపడలేదు.. దేవుడిచ్చిన వరకూ మాకు డబ్బులు బానే ఉన్నాయి.. ఫేమ్ కూడా బానే ఉంది.. ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాలి.. లైఫ్‌లో ఇది కూడా ఒక అవకాశం వచ్చిందని వెళ్లా అంతే” అంటూ మాధురి చెప్పింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read Also: Dinesh Karthik: పాక్ తో పోరుకు జట్టు సిద్ధం..కెప్టెన్‌ గా ఎవరంటే

పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్

ఏంటి మాధురికి నెలకి కోటి రూపాయలు వస్తున్నాయా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఆమెకి పెట్రోల్ బంకులు ఉన్నాయి.. అలానే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి.. కనుక మాధురి చెప్పిన నంబర్లు కరెక్టే అయి ఉండొచ్చని అంటున్నారు. ఇక బిగ్‌బాస్‌లో మాధురి ఆట విషయానికొస్తే హౌస్‌లో వెళ్లినప్పుడు ఫైర్ బ్రాండ్‌లా గట్టిగానే వాదించింది. తన ఆటతో ఫ్యాన్స్ కి కూడా సంపాదించుకుంది. ఇక బిగ్‌బాస్‌లో మాధురి ఆట విషయానికొస్తే హౌస్‌లో వెళ్లినప్పుడు ఫైర్ బ్రాండ్‌లా గట్టిగాానే వాదించింది. ముఖ్యంగా భరణి రిలేషన్స్‌పై టార్గెట్ చేసి హౌస్‌లో బంధాలపై గురి పెట్టింది. భరణి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయాడో అప్పటి నుంచి తనూజతో క్లోజ్‌గా ఉంది మాధురి. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమయంలో కూడా తనూజనే టైటిల్ గెలవాలంటూ మాధురి ఆకాంక్షించింది. భరణి అయితే అసలు హౌస్‌లో ఉండటానికే అర్హత లేదంటూ ఫైర్ అయింది. తనూజతో పాటు కళ్యాణ్, డీమాన్ కూడా చాలా రియల్‌గా ఉంటారని.. వాళ్లు కూడా బాగా ఆడాలని కోరుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Chandra Kanth Kollu (@actor_chandu24)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad