Saturday, November 15, 2025
Homeబిగ్‌బాస్ 9Ramu Rathod: తిన్నా తీరం బడుతలే.. ఏడ్పించేసిన రాము రాథోడ్..!

Ramu Rathod: తిన్నా తీరం బడుతలే.. ఏడ్పించేసిన రాము రాథోడ్..!

Ramu Rathod: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎన్నో మార్పులు చేసినప్పటికీ, ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే వాళ్లు వస్తున్నారు.. పోయే వాళ్లు పోతున్నారు. కొందరు ఇంటికి దూరంగా ఉండలేరు. మరికొందరు అడవుల్లో పడేసినా ఉంటాం అనే టైపు. ఇంకొందరు ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా ఏదో దిగులుతో బాధపడుతుంటారు. ఆ కేటగిరిలోనే రాము రాథోడ్ ఉన్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో తెలియని మనుషులు మధ్య రాము రాథోడ్ లాంటి వాళ్లు ఉండటం కష్టమే. అయితే, ఈవారం ఎలిమినేషన్‌కి ముందే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. గత కొన్నాళ్లుగా ఇంటిపై బెంగతో బాధపడుతున్న రాము.. గేమ్‌పై అస్సలు ఫోకస్ పెట్టడం లేదు. అస్సలు ఇన్వాల్వ్ కావడం లేదు. ఒంటరిగా ఏదో పోగొట్టుకున్నవాడిలాగే ఉంటున్నాడు. అతని బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీం.. ఇంటి నుంచి బయటకు పంపించింది.

- Advertisement -

Read Also: Bigg Boss Updates: శివ లుక్‌లో నాగ్ స్టేజ్ ఎంట్రీ

వెళ్తూ వెళ్తూ..

బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ ఏడిపించేశాడు రాము రాథోడ్. తాజా ప్రోమోలో నాగార్జున.. రాముతో మాట్లాడి.. అతని బాధను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘ఏమైంది రామూ.. బాగా హోం సిక్ అయిపోయావా? ఇంటిపై బెంగగా ఉందా? ఇంటికి వెళ్లిపోదాం అనుకుంటున్నావా? ఏమైంది రామూ..? అసలేమైంది? నీ మనసు మౌనంగా ఉంటే అర్థం కాదు మాట్లాడు? అని నాగార్జున అనడంతో.. పాట ద్వారా తన బాధను వ్యక్త పరిచాడు రాము రాథోడ్. తిన్నా తీరం బడుతలే.. కూర్చొన్నా తీరంబడుతలే. ఏడున్నా తీరంబడుతలే.. ఎవరున్నా తీరంబడుతలే.. బాధౌతుందే నీ యాదిల మనసంతా. మస్తు బరువౌతోందే అమ్మ యాదిలో మనసంతా? అంటూ గుండె లోతుల్లో ఉన్న బాధను తన పాట ద్వారా వినిపించాడు రాము రాథోడ్. మాట్లాడూ.. మాట్లాడు అంటే.. గుండెల్లో నుంచి పొంగుకొస్తున్న బాధను.. పాట ద్వారా వినిపించి గుండెల్నిపిండేశాడు రాము.

Read Also: India Pakistan Match: 2028 ఒలింపిక్స్‌లో భారత్‌-పాకిస్థాన్‌ పోరు డౌటే!

రాము ఏం చెప్పాడంటే?

చిన్నప్పటి నుంచి.. మా పేరెంట్స్ మా దగ్గర లేరు. పనికోసం మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు సార్. కూలిపనికోసం వెళ్లిపోయినప్పుడు వాళ్లకి దూరంగానే ఉన్నాను. ఇప్పుడు నేను సెట్ అయ్యాను.. వాళ్లని చూసుకోవాలి అనుకునే టైమ్‌కి ఇన్నిరోజులు దూరంగా ఉన్నాను’ అని ఎమోషనల్ అయ్యాడు రాము రాథోడ్. అయితే రాముని హౌస్‌లో ఉంచాలని చాలా కన్వెన్స్ చేశారు నాగార్జున. ‘హీరోస్ ఎప్పుడూ.. ఆట అంతు చూస్తారు.. ఇలా మధ్యలో వదిలేసి వెళ్లిపోరు. నీకు 10 సెకన్స్ టైమ్ ఇస్తున్నా. పారిపోరు. నువ్వు వెళ్లాలి అనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తాను వెళ్లిపో అని అన్నారు నాగార్జున. ‘నేను వెళ్తాను సార్’ అని తెగేసి చెప్పేశాడు రాము రాథోడ్. దాంతో బిగ్ బాస్ ఓపెన్ ది డోర్స్ అని అనేశారు నాగార్జున. ఇంట్లో వాళ్లు రాముని కన్వెన్స్ చేస్తున్నారు కానీ.. రాము హౌస్‌ని వీడి వెళ్లిపోయాడు.

స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత..

ఇక స్టేజ్ మీదికి వచ్చిన తరువాత.. ‘ఏంటి రామూ.. ఇంటిపై అంత బెంగ ఉందా?? ఇప్పుడైనా మాట్లాడు రామూ’ అని అన్నారు నాగార్జున. ఫ్యామిలీ గుర్తొస్తుందా? కలలు వస్తున్నాయా? అంటూ రాముని బుజ్జగిస్తూ మాట్లాడారు నాగార్జున. ఫ్యామిలీ గుర్తొస్తుంది సార్.. మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు.. వాళ్లంతా గుర్తొస్తున్నారు అని రాము అనడంతో.. ‘సరే నువ్వు వెళ్లే ముందే నీ జర్నీ వీడియో చూపిద్దాం అంటే రెడీ చేసుకోలేదు.. కాబట్టి అందరికీ బై బై చెప్పేసి వెళ్లిపోదువు గానీ అంటూ హౌస్‌లో వాళ్లతో మాట్లాడించారు నాగార్జున. అయితే వెళ్లే ముందు కూడా హౌ్ మేట్స్‌తో రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. సో సారీ ఆడియన్స్. నన్ను అర్థం చేసుకోండి.. నేను ఎప్పుడూ గివ్ అప్ చేయలేదు.. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి ప్లీజ్’ అంటూ ఇంటికి బయల్దేరాడు రాము రాథోడ్.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad