Bigg Boss Saturday Episode: బుల్లితెర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 తొలి శనివారం ఎపిసోడ్ వచ్చేసింది. కొత్త కంటెస్టెంట్స్.. కొత్త హౌస్.. తొలివారంలో గొడవలు, గోలల నేపథ్యంలో హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరికి క్లాస్ పీకుతారా? ఎవరిని ఎత్తేస్తారా? అంటూ తొలివారం ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూడగా.. ఇక శనివారం జరిగిన ఏడో ఎపిసోడ్‌లో నాగార్జున ఫైర్ చూపిస్తూ ఒక్కొక్కరి బాక్స్ బద్దలు కొట్టేశారు. ఇక తొలివారం కాబట్టి.. ఎగ్జైట్‌మెంట్ మామూలుగా లేదు. ఇక నాగార్జున చూడగానే.. ప్రతి సీజన్‌లోని కంటెస్టెంట్స్ మాదిరిగానే.. వావ్ సార్.. హ్యాండ్సమ్ సార్ అంటూ హౌస్‌లో ఉన్న లేడీ కంటెస్టెంట్ కింగ్ ని పొగడ్తలతో ముంచేశారు. సంజనా అయితే లవ్ సింబల్ చూపిస్తూ.. చాలా అందంగా ఉన్నారు సార్.. మిమ్మల్ని చూడగానే రిఫ్రెష్ అయిపోయాం.. చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని అన్నది. ఇక అమ్మాయి లవ్ సింబల్ చూపిస్తే మన మన్మథుడు ఊరుకుంటాడా?? ఆయన కూడా లవ్ సింబల్‌ని చూపించేసి.. నీలో కూడా రోజుకో కొత్త పర్సన్ కనిపిస్తున్నారు అంటూ పంచ్ వేశారు. దెబ్బకి హౌస్ అంతా చప్పట్లతో మారుమాగుపోయింది. కొత్త పర్సన్ కనిపించడం కాదు సార్.. తనలోకి కొత్త పర్సన్‌ని చూపిస్తుంది అని అన్నాడు ఇమ్మానుయేల్.
Read Also: Canada: కార్మిక విధానాల్లో మార్పులు.. ఇకపై కెనడా వెళ్లి పనిచేయాలంటే కష్టమే
గుండు అంకుల్ తో హాయ్ హల్లో
ఆ తరువాత మన గుండు అంకుల్ హరీష్‌ని లేపి.. ‘ఎలా ఉన్నావ్ అని అడిగారు. చాలా బాగున్నా సార్ అని హరీష్ అనడంతో.. ‘నువ్వు నవ్వితే చాలా బావుంటావు.. దయచేసి కూర్చో అన్నారు నాగ్. అంటే ఎప్పుడూ సీరియస్‌గా మొహం పెట్టి.. పాత సినిమాలో విలన్ మాదిరిగా ఉండొద్దని.. కాస్త నవ్వమని ఇన్ డైరెక్ట్‌గా చెప్పారు. ఆ తరువాత హౌస్‌లో ఉన్న వాళ్లందర్నీ పలకరించారు. ఇక రీతూతో పులిహోర కలుపుతున్న పవన్ కళ్యాణ్‌ని లేపి.. ‘సోల్జర్ డ్యూటీ ఎలా ఉంది’ అని పంప్ వేశారు నాగ్. ఆ మాటకి తెగ నవ్వేసుకుంది రీతూ. పర్లేదు సార్.. హ్యాండిల్ చేయొచ్చు అని అన్నాడు పవన్.
బ్లూ ఫేవరేట్
ఆ తరువాత రీతూని లేపి.. నీ లక్కీ కలర్ బ్లూ అన్నావ్ కదా.. మరి నువ్వెందుకు వేసుకోలేదు అని అడిగారు నాగ్. మీరు వేసుకుని వచ్చారు కదా.. మీ లక్ నాకు అంటించండి అని అన్నది రీతూ. దాంతో నాగార్జున.. ఆమె ఎదపై డిష్ వాషర్ అని బ్లూకలర్ బోర్డ్‌ని జిరాక్స్ తీసిన నాగార్జున.. దానిపై ఉందిలే బ్లూ అంటూ మన్మథుడు అని అనిపించాడు. ఆ తరువాత ఇమ్మానుయేల్‌తో సరదాగా మాట్లాడుతూ.. నువ్వు కూర్చో గుండు అంకుల్ తరువాత మాట్లాడుకుందాం అని అన్నారు. ఇక ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిన సంజనకి క్లాప్స్ కొట్టారు నాగ్. సార్.. ఎవరూ కెప్టెన్ మాట వినడం లేదు.. చాలా బాధలు ఉన్నాయి సార్ చెప్పుకోవాలి అని అన్నది.
Read Also: Bigg Boss Today Promo: బాక్సు బద్దలైపోద్ది.. సంజనాకు వార్నింగ్.. నాగార్జున బ్యాటింగ్ స్టార్ చేశాడోచ్
ఫ్రీ బర్డ్
తరువాత వింటాను కూర్చో అని అన్నారు నాగ్. తనూజతో కూడా తరువాత మాట్లాడదాం అని అన్నారు. ఆతరువాత మర్యాద మనీష్‌ని లేపి.. నీకు మర్యాద ఏమైనా తగ్గిందా? అని అడిగారు. నేను ఓనర్‌కి కదా బాగానే ఇస్తున్నారు అని అన్నాడు మనీష్. సరే నా ముందు బాక్స్‌లు ఉన్నాయ్ కాసేపట్లో బద్దలౌతాయి అని హెచ్చరించారు నాగ్. ఆ తరువాత బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. ఫ్రీ బర్డ్‌తో మొదలుపెడతాం అంటూ ఆ కార్డ్ తీసి సంజనా, ఫ్లోరా షైనీల మధ్య జరిగిన ఫ్రీ బర్త్ ఇష్యూపై చర్చ మొదలుపెట్టారు. రాము రాథోడ్.. మీకు పెళ్లైందా? అని నాతో మాట్లాడుంటే.. నేను రిలేషన్‌లో ఉన్నా అని చెప్పా. ఇంతలో సంజనా వచ్చి ఈమె ఫ్రీ బర్డ్ అని చెప్పింది అని కంప్లైంట్ చేసింది ఫ్లోరా.
సంజనాపై ఫైర్..
అంటే నీకు ఫ్రీ బర్డ్ అని చెప్పడం ఇష్టం లేదా? కమిటెడ్ రిలేషన్ షిప్ అని చెప్తే బావుందేదా? అని అడిగారు నాగ్. అవును సార్.. అలాగే చెప్పాలి అని అన్నది ఫ్లోరా. ఇంతలో సంజనా కల్పించుకుని.. ఫ్రీబర్డ్ అంటే తప్పు కాదు సార్.. ఏ డిక్షనరీలో చూసినా అదే తప్పు పదం కాదు అని సమర్ధించుకుంది. దాంతో వీడియో వేసి చూపించారు నాగ్. నేను క్లీయర్‌గానే చెప్పాను కదా సార్.. ఆమెకి అది తప్పుగా అర్థం అయ్యింది. అయితే సంజనాను పర్సనల్‌గా టార్గెట్ చేసిందని హౌస్‌లో ఉన్న వాళ్లంతా సంజనాను తప్ప పట్టారు. ఇక ఫ్లోరాకి కాఫీ ఇవ్వొద్దని సంజనా చెప్పిందని హౌస్‌లో వాళ్లు చెప్పడంతో.. సంజనాకి క్లాస్ పీకి ఆమె బాక్స్ కూడా బద్దలు కొట్టేశారు నాగ్.
తనూజకు సపోర్ట్..
ఆ తరువాత సంజనా గురించి ఫ్లోరా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడంతో దానిని గుర్తు చేస్తూ నాగ్ ముందు ఏడ్చేసింది సంజనా. దాంతో నాగ్ క్షమాపణ చెప్పమన్నారు. అందరి ముందు సంజనాకి క్షమాపణ చెప్పింది ఫ్లోరా. ఇక తనూజని ధైర్యంగా ఉండమని చెప్పారు నాగ్. ఏడొద్దు తనూజా.. నిన్ను ఎమోషనల్‌గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు.. నువ్వు ఏడొద్దు. ధైర్యంగా ఎదుర్కో.. మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు అని ఇన్ డైరెక్ట్‌గా మాస్క్‌మెన్‌కి చురకలు వేశారు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. నిందను తనూజ మీదికి నెట్టేసిన ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకారు నాగ్.
ఇద్దర్నీ కలిపేసిన మన్మథుడు
ఓనర్స్ అయితే మాత్రం ఇంత శాడిజమా? బిగ్ బాస్ ఓనర్స్‌గా పెట్టింది మీ బిహేవియర్‌ని తెలుసుకోవడం కోసమే.. మీ శాడిజం చూపించడానికి కాదు’ అని దమ్ము శ్రీజ బాక్స్ పగలకొట్టేశారు నాగ్. ఆ తరువాత తనూజని దూరం పెట్టి.. శాడిష్టులా బిహేవ్ చేసిన రీతూ చౌదరికి బుద్ది చెప్పారు నాగ్. సోల్ హార్ట్ ఫ్రెండ్‌ని ఎవరో ఏదో చెప్పారని దూరం పెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఆ ఇద్దరి కలిపేశారు నాగ్. తనూజ, రీతూ హగ్ ఇచ్చుకుని కలిసిపోయారు.


