Bigg Boss: బుల్లితెర అభిమానాలు ఎంతగానో ఎదురుచేసిన బిగ్ బాస్-9 భారీ అంచనాలతో గ్రాండ్ లాంఛ్ అయితే అయింది. అయితే, గత సీజన్ లో విష్ణుప్రియ, పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే తొలిరోజు కంటెంట్ అంతా సింగిల్ హ్యాండ్‌తో కొట్టేశాడు మాస్క్‌మ్యాన్ హరీష్. కానీ ఎపిసోడ్ మొత్తం ఒక రెండు నిమిషాలు మాత్రం రీతూ చౌదరి మాయ చేసింది. అయితే చేసింది మనల్ని కాదండోయ్.. జవాన్ పవన్ కళ్యాణ్‌ని. మరి డే 1 ఏపిసోడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
క్యూట్ రొమాన్స్..
బిగ్‌బాస్ ఎందుకు చూస్తారా అని థింక్ చేయాల్సిందే. ఎందుకు చూస్తారు అని ఎవరినైనా అడిగితే పెద్దగా ఆన్సర్ ఏం ఉండదు. దానికి పెద్దగా కారణాలు ఏం ఉండవు. సింపుల్‌గా చెప్పాలంటే పొరుగింట్లో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుత అందరికీ ఎక్కువే.. మన ఇంట్లో లక్ష సమస్యలున్నా.. పక్క కొంపలో జరిగే చిల్లర లెక్కలు చూడాలని తహతహలాడిపోవడం మన సహజ స్వభావం. అందుకే ఎన్ని భాషల్లో వచ్చినా.. ఎంతసేపు చూపించినా చూస్తూనే ఉంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్లు, ఎలిమినేషన్లు, గొడవలు, కొట్లాటలు చూడటానికి ఎంత బాగుంటాయో.. అర్ధరాత్రి గుసగుసలు, క్యూట్ రొమాన్స్‌లు, అలకలు, కులుకులు, లవ్ ట్రాక్‌లు కూడా సూపర్ గా ఉంటాయి. నిజానికి సీజన్ బాగుండాలంటే ఇది కూడా పక్కాగా ఉండాల్సిందే. గత సీజన్‌లో హౌస్ మొత్తంలో విష్ణుప్రియ-పృథ్వీరాజ్ లవ్ ట్రాక్ మాత్రమే సెట్ అయింది. అయితే, విష్ణ నడిచిన వేలోనే రీతూ నడవాలని చూస్తోంది. ఈ సీజన్‌లో అలా ఎవరుంటరబ్బా అనుకుంటుంటే నేనున్నాగా అంటూ రీతూ చౌదరి ట్రాక్ ఎక్కడానికి రెడీ అయిపోయింది. ఇక తాజాగా మొదలైన బిగ్‌బస్ సీజన్-9 డే 1లో హైలెట్ అయిన ఆ మ్యాటర్ ని చూసేద్దాం.
Read Also: Gaza: గాజాను ఖాళీ చేయించే పనిలో ఇజ్రాయెల్..!
కంటి చూపుతో.. నీ కంటి చూపుతో..
ఈరోజు ఎపిసోడ్‌లో కామనర్ జవాన్ పవన్ కళ్యాణ్ కళ్లల్లో కళ్లు పెట్టి రీతూ చూసిన చూపులకి హౌస్‌మెట్స్ అంతా షాక్ అయ్యారు. ఏదో చిన్న గేమ్ అంటూ పవన్ కళ్యాణ్‌ని ముందు ఒప్పించింది రీతూ. ఎవరు కళ్లు ఆర్పకుండా ఒకరి కళ్లలో మరొకరు ఎక్కువసేపు చూస్తారో చూద్దామని రీతూ అంది. దీనికి పడాల పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నాడు. ఇంతలో ప్రియ, శ్రీజ దమ్ము సహా కొంతమంది కామనర్లు వచ్చి ఏం జరుగుతుందా అంటూ చుట్టూ చేరారు. ఇక స్టార్ట్ అనగానే రీతూ చౌదరి.. పవన్ కళ్లల్లో కళ్లు పెట్టి అలా చూస్తూ ఉండిపోయింది. మనోడ్ని డిస్ట్రాక్ట్ చేయడానికి గట్టిగానే ట్రై చేసింది. మధ్య మధ్యలో ఓర చూపులు రువ్వుతూ.. చిన్న స్మయిల్ కూడా విసిరింది.. కానీ కళ్యాణ్ బాబు మాత్రం అలానే చూస్తూ ఉన్నాడు. చివరికి మనోడు కళ్లార్పేలా లేడని రీతూకి అర్థమైపోయింది. ఇక కళ్లల్లోనుంచి నీళ్లు రావడంతో రీతూ కళ్లు మూసేసింది. అట్లుంటది మనతోని అంటూ పవన్ కళ్యాణ్ తెగ గెంతులేశాడు. ఇలా ఈ సీన్ జరిగింది రెండు నిమిషాలే అయినా ఎపిసోడ్‌లో హైలెట్ అయింది. మరి ఈ లవ్ ట్రాక్‌ని బిగ్‌బాస్ కూడా ఎంకరేజ్ చేసి కానివ్వండ్రా కానివ్వండి అంటాడో ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తోంది. అయితే, రీతూ చౌదరి మాత్రం కంటెంట్ ఇవ్వడానికి గట్టిగానే ఫిక్స్ అయినట్లుంది.
Read Also: Bigg Boss: జనసైనికులు రెడీయా.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లగానే నాగబాబు పోస్ట్


