Rithu Chowdhary: సంజన ఎలిమినేషన్ డ్రామాతో శనివారం నాటి ఎపిసోడ్ సాగిపోయింది. ఆమెను మిడ్ వీక్ ఎలిమినేటర్ చేసినట్టే చేసి సీక్రెట్ రూంలోకి పంపించారు. అయితే శనివారం నాటి ఎపిసోడ్‌లో మళ్లీ స్టేజ్ మీదికి తీసుకొచ్చి.. హౌస్‌లో ఉన్న వాళ్లందరికీ చివాట్లు పెట్టించి తిరిగి ఇంటికి పంపే ప్రయత్నం చేస్తూ.. చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌లో ఉన్న వాళ్లు కొన్ని త్యాగాలు చేస్తే.. మళ్లీ సంజన ఇంట్లోకి వస్తుందని ఫిటింగ్ పెట్టారు. ప్రతి సీజన్‌లో మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా హెయిర్ కటింగ్ ప్రోగ్రాం పెట్టాడు. బిగ్ బాస్ ఏదొక ఫిటింగ్ పెట్టి.. మీరు మీ బొచ్చెని త్యాగం చేయాలి అని అంటాడు. దాంతో వాళ్లు భోరు భోరున ఏడుస్తూ ఓ రేంజ్‌లో జీవించేస్తుంటారు. నిజానికి అమ్మాయిలకు జుట్టు అనేది ఓ ఎమోషన్. వాళ్ల అందాన్ని రెట్టింపుచేసేది కూడా జుట్టే. దాన్ని కత్తిరించుకోవడం అంటే కాస్త ఇబ్బందే. బాధ కూడా ఉంటుంది. అయితే బిగ్ బాస్‌లో మాత్రం వీళ్లు చేసే యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు.
త్యాగాలు చేసిన హౌస్ మేట్స్
అయితే, సంజన రీఎంట్రీలో భాగంగా.. తనూజ కాఫీ, ఇమ్మానుయేల్ తన కెప్టెన్సీ, భరణి లాకెట్‌లు త్యాగం చేశారు. ఇక సుమన్ శెట్టిని సిగరెట్ హ్యాబిట్ మానుకోవాలని కోరగా.. అతను నో నేను త్యాగం చేయను అని చెప్పేశాడు. ఇక శ్రీజాని తన బట్టలు మొత్తం త్యాగం చేయాలని కోరారు నాగార్జున. ఎన్నిరోజులు త్యాగం చేయాలని సార్ అని అడిగింది శ్రీజా. నువ్వు ఇక్కడ ఎంత కాలం ఉంటే అంత కాలం అని అన్నారు నాగార్జున. ఒక్క డ్రెస్‌తో ఎలా ఉంటాం సార్.. నో అని అనేసింది. ఇక చివరి ఛాన్స్‌గా రీతూ చౌదరి హెయిర్ కట్ చేసుకోవాలి. టామ్ బాయ్ కట్ చేయించుకుంటే.. బ్యాటరీ ఫుల్ రీచార్జ్ అయ్యి.. సంజన మళ్లీ ఇంట్లోకి వస్తుంది. కాబట్టి.. ఆమె రావాలంటే నువ్వు నీ హెయిర్‌ని త్యాగం చేయాల్సిందే అని అన్నారు నాగార్జున. దాంతో నోరెళ్ల బెట్టిన రీతూ.. షాక్‌లో ఉండిపోయింది. నాగార్జున నెంబర్స్ లెక్కిస్తుంటే.. ఓకేసార్ అనేసింది రీతూ. అప్పుడు నాగార్జున.. పవన్ స్టోర్ రూంలోకి వెళ్లు.. అక్కడ కత్తెర ఉంది తీసుకుని రా అని అన్నారు. రీతూ బొచ్చె కత్తిరించడానికి కావాల్సిన కత్తెర కోసం డీమాన్ పవన్‌ని పంపించడం ఏదైతే ఉందే హైలైట్ అంతే. తీరా.. ఓకే అనేసిన తరువాత.. ఏడుపు స్టార్ట్ చేస్తుంది రీతూ. ఒకే అన్న తరువాత ఎందుకు ఏడుస్తున్నావ్ అని అన్నది తనూజ.
Read Also: Bigg Boss Sanjana Galrani: ఇదేం న్యాయం నాగార్జున గారు.. హరీష్ ని బలి చేసేశారుగా..!
తెగఫీల్ అయిపోయిన ఢమాల్..
ఇక డీమాన్ పవన్ అయితే తెగ ఫీల్ అయిపోతూ ఆ కత్తెర తీసుకుని వచ్చాడు. మెడవేలాడేసి.. ఏదో వీడ్ని గుండు కొట్టుకోమన్నట్టుగా మెడ వేలాడేసి తెగ ఫీల్ అయిపోయాడు. రీతూ కూడా అతనితోనే గుసగుసలాడింది. ముందుగా ఫ్లోరాని పిలిచి హెయిర్ కట్ చేయమన్నారు. నీకు కష్టం అనిపిస్తే.. దివ్య వచ్చి కట్ చేస్తుంది అని అనడంతో.. వైల్డ్ కార్డ్‌గా వెళ్లిన దివ్య కత్తెర అందుకుంది. సార్.. నేను నా హెయిర్ సంజన కోసం త్యాగం చేస్తే.. ఆమె తప్పకుండా వస్తుంది కదా సార్ అని అడిగింది రీతూ. ‘నీ ప్రయత్నం అయితే వ్యర్థం కాదు.. బ్యాటరీ 75 పర్సెంట్ రీచార్జ్ అవుతుంది అని అన్నారు నాగార్జున. దాంతో రీతూ.. ‘సార్.. సంజన నాకు రోజూ తినిపించేది సార్’ అని అన్నది. ఇదంతా కాదు.. నీ హెయిర్‌ని త్యాగం చేస్తున్నావా? లేదా? అని అడిగారు నాగార్జున. అప్పుడు రీతూ పక్కనే ఉన్న ఢమాల్ పవన్.. ‘ఆలోచించు.. ఆలోచించు’ అని అన్నాడు. అయితే రీతూ మాత్రం సరేనని అనడంతో.. దివ్య కత్తెర అందుకుని కచకచా కత్తెరేసేసింది. దివ్య మాత్రం.. చాలా కసిగా కట్ చేస్తూ కనిపించింది దొరికావే అన్నట్టుగా.
Read Also: Bigg Boss New Promo: ఎప్పుడ్రా బిడ్డా? నేను చీప్ అమ్మాయినా? సంజన ఆన్ ఫైర్
ఎందుకంటే.. రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. ఆమె బిగ్ బాస్ లాంఛింగ్ రోజు స్టేజ్ మీదికి రాగానే.. కమాన్ దివ్యా అని అన్నారు నాగార్జున. దాంతో వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి.. ‘నో సార్.. ఆ పేరు అంటే నాకు ఇరిటేషన్ వస్తుంది.. ఆ పేరు చాలామందికి ఉంటుంది.. అందుకే నా ఇష్టం ఉండదు’ అంటూ దివ్య నిఖిత ముందే అన్నది. ఆ టైమ్‌లో దివ్య నిఖిత ఎక్స్ ప్రెషన్స్ చూడాలీ.. మామూలుగా లేవు. ఇప్పుడు వనం దివ్య బొచ్చెని.. దివ్య నిఖితతో కత్తెరేయిండంతో ఆమె కోపం చల్లారినట్టే అయ్యింది. ఆమె చుట్టు కత్తెరిస్తుంటే.. వనం దివ్య భోరు భోరున ఏడ్చేసింది. అయితే, ఇక్కడ రీతూ బొచ్చు కత్తిరిస్తుంటే.. ఢమాల్ పవన్ తెగ ఫీల్ అయిపోయాడబ్బా. ఏడుపు ఒక్కటే తక్కువ. హౌస్‌లో అంతమంది ఉండగా.. ఈ కాట్రాజ్ ఒక్కడే అంతలా ఫీల్ అయిపోవడానికి కారణం ఏంటో.. మీకు అర్థమౌతోందా?? ఈ జట్టు కత్తిరింపు అనేది.. ఈ సీజన్‌లోనే కొత్తేం కాదు.. ప్రతి సీజన్‌లోనూ వస్తూనే ఉంది. రెండో సీజన్ నుంచి మొదలైన బొచ్చె కత్తిరింపు కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దీప్తి సునయన, శివజ్యోతి, దేత్తడి హారిక ఇలా వీళ్లంతా బొచ్చుకత్తించుకున్న వాళ్లే. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రీతూ చౌదరి చేరింది.


