మెటా సంస్థ అన్నంత పని చేసేస్తోంది. కాస్ట్ కటింగ్, ఉద్యోగుల కోత అని ఇప్పటికే పలు దఫాలుగా కోతలు విధించిన మెటా సంస్థ తాజాగా మరో 15,000 ఉద్యోగాలు హాం ఫట్ అని అధికారికంగా ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ 2023ని ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీగా పేర్కొంటూ తాజాగా 10,000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది. మరోవైపు 5,000 మంతి అడిషనల్ ఓపన్ రోల్స్ ను భర్తీ చేయకూడదని జాబ్ కట్స్ విధించింది. కంపెనీ దీర్ఘకాలంలో ఆర్థికంగా చిక్కుల్లో పడకుండా ఇలాంటి కఠిన చర్యలు అవలంభిస్తున్నట్టు మెటా సీఈవో మార్క్ జూకర్ బర్గ్ వెల్లడించారు. ఫేస్ బుక్ లో కూడా ఇలాంటి చర్యలే గతకొంతకాలంగా అనుసరిస్తున్నారు. లే ఆఫ్స్ తో కాస్ట్ కటింగ్ మంత్రాను పాటించటం కార్పొరేట్ లో రొటీన్ గా మారింది. అమెరికా ఎకానమీలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి.