హై లైఫ్ ఎగ్జిబిషన్ మళ్లీ హైదరాబాద్ లో సందడి చేయనుంది. మూడు రోజులపాటు సాగే ఈ ఎగ్జిబిషన్ కం సేల్ లో ఈసారి థీమ్ లగ్జరీ-గాంభీర్యం అని నిర్వాహకులు వెల్లడించారు. రెగ్యులర్ గా ఫ్యాషన్ ఎగ్జిబిషన్స్ చేస్తున్న హైలైఫ్ ఎగ్జిబిషన్ హైదరాబాద్‌లో అత్యంత ఎదురుచూస్తున్న ఈవెంట్ గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ను సృష్టించుకుంది.
ఇయర్ ఎండింగ్ తో పాటు న్యూ ఇయర్ ట్రెండ్స్ ను ఫ్యాషన్ లవర్స్ ను ఊరించేలా ఈ ఈవెంట్ రెడీ అయింది. ఈ డిసెంబరులో విలాసవంతమైన లైఫ్ స్టైల్ ను మెయిన్టెన్ చేసేలా ట్రెండీ వల్డ్ లో మునిగిపోయేలా హైలైఫ్ ఎగ్జిబిషన్ సాగనుంది.
విశిష్ట ఆభరణాల వ్యాపారుల నుండి అద్భుతమైన కళాఖండాలను చూసి ఆశ్చర్యపోయేలా, అబ్బురపరిచే పెళ్లికూతురు అలంకరణలు, అధునాతన రోజువారీ అవసరాలు, షో-స్టాపింగ్ స్టేట్‌మెంట్ లను సొంతం చేసుకునేలా హైలైఫ్ ఈవెంట్ ఉండనుంది.
డిసెంబర్ 27, 28, 29వ తేదీల్లో హైదరాబాద్ లోని నోవోటెల్ హెచ్ఐసీసీలో హైలైఫ్ ఎగ్జిబిషన్ సాగనుంది. 2024కి ఫ్యాషన్ లవర్స్ ట్రెండీగా గుడ్ బై చెబుతూ, 2025కు గ్రాండ్ గా వెల్కం చెప్పేలా ఈ ఈవెంట్ సాగునుండగా, ఫ్యాషన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.