Thursday, October 24, 2024
Homeట్రేడింగ్Blinkit: బ్లింకిట్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఈఎంఐ ఆప్షన్

Blinkit: బ్లింకిట్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఈఎంఐ ఆప్షన్

Blinkit| గతంలో ఏ వస్తువు కొన్నాలన్నా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆలోచించేవారు. వేలు, లక్షల్లో వస్తువులు ఉండంటతో కొనడానికి వెనకాడేవారు. అయితే డిజిటల్ టెక్నాలజీ ఎక్కువ కావడంతో కొంతకాలంగా అన్ని కంపెనీలు ఈఎంఐ(EMI) ఆప్షన్ తీసుకువచ్చాయి. దీంతో ప్రతి ఇంట్లో కాస్ట్లీ వస్తువులైనా ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ ఇలా ఎన్నో రకాల తప్పనిసరిగా ఉంటున్నాయి. ప్రస్తుతం కిరాణా సరుకులకు కూడా ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా జొమాటో(Zomoto) ఆధ్వర్యంలో నడిచే క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్(Blinkit) తన కస్టమర్ల కోసం ఈఎంఐ చెల్లింపు సదుపాయం తీసుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈవో అల్బీందర్ దిండ్సా అధికారిక ప్రకటన చేశారు.

- Advertisement -

రూ.2,999 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. బ్లింకిట్‌లో రూ.2,999 కంటే ఎక్కువ కొనుగోలు చేసే వారు ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని దిండ్సా వెల్లించారు. అయితే బంగారం, వెండి కొనుగోళ్లకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. తొలుత కావాల్సిన ఉత్పత్తులను కార్ట్‌లో యాడ్ చేసుకోవాలి. అనంతరం చెక్ఔట్ సమయంలో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత బ్యాంక్ క్రెడిట్ కార్డులను సెలెక్ట్ చేసుకోవాలి. ఐసీసీఐ(ICICI) బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), కోటక్(KOTAK) మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్(RBL) బ్యాంక్, సిటీ బ్యాంక్(CITY BANK) క్రెడిట్ కార్డులు కలిగిన వారు మాత్రమే ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 3, 6, 9 నెలలు కాల వ్యవధులను ఎంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News