బడ్జెట్-2023 అంటేనే ఎన్నికల బడ్జెట్ అనేది ఓపన్ సీక్రెట్ అందుకే మధ్యతరగతి వారిని గట్టిగా ఆకర్షించేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు జోరుగా చేసింది. ఇందులో భాగంగా యూత్ పవర్, మహిళా సేవింగ్స్, సమీకృత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, గ్రీన్ గ్రోత్ అనే మంత్రాలు పఠించారు నిర్మలమ్మ.
‘ఉమీద్ కా బడ్జెట్’ అంటూ ఆమె కొత్త ట్యాక్స్ పాలసీలో భాగంగా 7 లక్షల రూపాయల ఆదాయం వరకు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. కొత్త ఇన్కంట్యాక్స్ పాలసీ సెలెక్ట్ చేసుకుంటే 9-12 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 15 శాతం పన్ను కట్టాల్సి వస్తుంది. 12-15 లక్షల ఆదాయం ఉన్నవారు 20 శాతం ట్యాక్స్, 15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్నుకట్టక తప్పదు.
సీనియర్ సిటిజెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములో డిపాజిట్ లిమిట్ 30,00,000 రూపాయలకు పెంచారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరుతో సరికొత్త పథకాన్ని మహిళల కోసం ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రెండేళ్ల కాలానికి మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుందని, ఈ ఎఫ్డీపై 7.5 శాతం వడ్డీ ఇవ్వనున్నట్టు వెల్లడించారు.