వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త శాఖను హైదరాబాద్ లో ప్రారంభించింది. 114 సంవత్సరాల పురాతన ప్రభుత్వ రంగ బ్యాంకైన సెంట్రల్ బ్యాంక్ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్ కావటం విశేషం.
కొత్త శాఖను జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్. కె (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్స్ హైదరాబాద్ జోనల్ హెడ్ ) ప్రారంభించారు. మణికొండలో సెంట్రల్ బ్యాంక్ కొత్త శాఖను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చి, తన సేవలను నగరంలో మరింత విస్తరిస్తోంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ రీజినల్ హెడ్ జి. రామకృష్ణన్, మణికొండ బ్రాంచ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిజిఎం ఎ. సురేష్, డి.బాపన్న (రిటైర్డ్ జిఎం), రాజేంద్ర కుమార్ (రిటైర్డ్ జిఎం), లక్ష్మణ్ రావు (రిటైర్డ్ డిజిఎం) బ్యాంక్ కస్టమర్లు పాల్గొన్నారు.
కొత్త శాఖను జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్. కె (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్స్ హైదరాబాద్ జోనల్ హెడ్ ) ప్రారంభించారు