Sunday, September 8, 2024
Homeట్రేడింగ్Chandana Brothers Shopping Mall launched in Vanaparthi: వనపర్తిలో చందన బ్రదర్ షాపింగ్...

Chandana Brothers Shopping Mall launched in Vanaparthi: వనపర్తిలో చందన బ్రదర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

వనపర్తి జిల్లా కేంద్రంలో నూతన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చందన బ్రదర్స్ అధినేత సురేష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, సినీ తార వైష్ణవి చైతన్య పాల్గొని అత్యంత వైభవంగా ప్రారంభించారు.

- Advertisement -

నా కెరీర్లో మొదటి ప్రారంభోత్సవమన్న హీరోయిన్..

ఈ సందర్భంగా సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏడవ షోరూం వనపర్తిలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, తన కెరీర్లో మొదటి ప్రారంభోత్సవ వేడుకని, తనకు రకరకాల డిజైన్ చీరలు అంటే చాలా ఇష్టమని, షాపింగ్ మాల్ మొత్తం చూశానని, చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ షాపింగ్ మాల్ లో పెద్దల నుండి చిన్నారుల వరకు సరసమైన ధరలో వస్త్రాలు-బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు.

పట్టణాభివృద్ధికి ఇవే అలంకారాలు: ఎమ్మెల్యే మేఘారెడ్డి..
వ్యాపార సముదాయాలు పట్టణ అభివృద్ధికి అలంకార ప్రాయాలని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కొత్తకోట రోడ్డులో చందనా బ్రదర్స్ షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ ఉండడంతో కార్పొరేట్ స్థాయి షాపింగ్ మాల్స్ ఇక్కడికి రావడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు. షాపింగ్ మాల్స్ ఏర్పడడం వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వనపర్తి పట్టణం మొదటి నుంచి బంగారు వ్యాపారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఏళ్ల తరబడి బంగారం వ్యాపారం చేసే స్వర్ణకారులకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో వ్యాపారాన్ని కొనసాగించాలని చందనా బ్రదర్స్ యాజమాన్యానికి సూచించారు.

కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మహేష్, సమన్వయకర్త లక్కాకుల సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News