Sunday, December 8, 2024
Homeట్రేడింగ్CM Revanth launches MSME policy 2024: MSME పాలసీ-2024 ఆవిష్కరించిన సీఎం రేవంత్

CM Revanth launches MSME policy 2024: MSME పాలసీ-2024 ఆవిష్కరించిన సీఎం రేవంత్

సంపదను పెంపొందించాలనే..

MSME పాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు MSME లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించామన్న సీఎం రేవంత్..దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో వ్యవహరించారన్నారు. పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారని, ప్రపంచంతో పోటీ పడేలా విధి విధానాలు తీసుకొచ్చారన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయమన్నారు సీఎం.

- Advertisement -

పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదని, అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చిమన్నారు. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే… కొత్త పాలసీని ముందుకు తీసుకెళతామన్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిందని, మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదన్నారు.

రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదని, ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడిందని, అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసామన్నారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇందులో శిక్షణ ఇవ్వనున్నామని, యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తలు నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించామన్నారు. అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడం లేదని, తెలంగాణ రైతాంగానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని వదలొద్దు.. అగ్రికల్చర్ అనేది మన కల్చర్ అన్న సీఎం రేవంత్.. వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే ఇతర కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాలవైపు ప్రోత్సహించాలన్నారు. వ్యాపారాల్లో రాణించేలా ఎదగాలని, హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామన్నారు.

ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నామని, మూసీ అంటే మురికి కోపం కాదు… మూసీ ని మ్యాన్ మేడ్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదని, ఇది ప్రజల కోసమే పని చేసే ప్రజా ప్రభుత్వమన్నారు. మా ప్రభుత్వంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తోందన్నారు.

శిల్పారామంలో 3ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ మహిళల చేతుల్లోపెట్టామని, మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చామన్నారు. యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్ధికంగా ఆదుకుంటున్నామన్నారు. MSMEలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. MSMEలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News