హీరో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాన్ ఇండియా సీఎం అయ్యారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తెలిపారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. కొంత మంది సీఎంలు అవినీతి చేసి అందరికీ తెలిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం సాహసోపేత నిర్ణయాలు తీసుకొని ఫేమస్ అయ్యాని చెప్పారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చట్టప్రకారమే సీఎం నడుచుకున్నారని స్పష్టం చేశారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లా ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్ పార్టీ భావించడం లేదని.. బలమైన ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందని ఆరోపించారు. RRR రూ.7 వేల కోట్ల ప్రాజెక్ట్ అయితే అందులో రూ.12వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ (KTR) ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయనను అరెస్ట్ భయం వెంటాడుతోందని ఎద్దేవా చేశారు.