Wednesday, February 12, 2025
Homeట్రేడింగ్CMR Engineering College: సీఎం ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో NCC దినోత్సవ వేడుక

CMR Engineering College: సీఎం ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో NCC దినోత్సవ వేడుక

ఎన్.సి.సి. డే

ఎన్ సీ సీ 74వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం ఆర్ కళాశాల ప్రాంగణంలో సెక్రటరీ, కరస్పాండెంట్ సిహెచ్ శ్రీశైలంరెడ్డి జెండా హోస్టింగ్‌తో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ డా.ఎ.ఎస్.రెడ్డి, వివిధ శాఖల హెచ్‌ఓడిలు, ఎఎన్‌ఓ ఎ.రేణుకతో పాటు అధ్యాపకులు, ఎన్‌సిసి క్యాడెట్లు పాల్గొన్నారు . ఎన్.సి.సి. ప్రాముఖ్యతను వివరిస్తూ ఎన్.సి.సి క్యాడెట్‌ల స్వాగత ప్రసంగంతో ఆడిటోరియంలో అధికారిక వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సంస్కృతి నృత్యం, కళాత్మక యోగా వంటి వివిధ కార్యకలాపాలు విద్యార్థులచే ప్రదర్శిస్తామన్నారు. అనంతరం ఎన్‌సీసీ హ్యాండ్‌ బుక్‌ను ఆవిష్కరించారు.

- Advertisement -

సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిహెచ్. శ్రీశైలం రెడ్డి, ప్రిన్సిపల్ డా.ఎ.ఎస్. రెడ్డి విద్యార్థులను చైతన్యపరిచి, జీవితంలో క్రమశిక్షణ ప్రాముఖ్యతను, ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులందరూ ఐక్యత, క్రమశిక్షణా విలువలను అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు. తద్వారా దేశానికి సేవ చేయండి అని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News