ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. టెక్స్టైల్స్-జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిజామాబాద్ లో సరికొత్త బ్రాంచ్ ప్రారంభించింది. ఈ మాల్ ను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ లో సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఫులాంగ్ చౌరస్తా, హైదరాబాద్ రోడ్ వద్ద ఉంది.
4 దశాబ్దాలుగా..
సి.ఎం.ఆర్. ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ ..తమ సంస్థను గత 4 దశాబ్ధాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ మా 35వ షోరూమును నిజామాబాద్ ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్.లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్ కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే అందించటం తమ ప్రత్యేకత అన్నారు. తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం. ఆర్. అందిస్తుందన్నారు.
ది వన్ స్టాప్ షాప్ ..
సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తన 35వ షోరూమును నిజామాబాద్లో ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అంటే ఫ్యామిలీ అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షలలో డిజైన్లు వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు.
సందడి చేసిన రామ్, పాయల్ రాజ్ పుత్..
ఈ కార్యక్రమంలో సినీ హీరో రామ్ పోతినేని, సినీతార పాయల్ రాజ్పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్ పోతినేని మాట్లాడుతూ సి.ఎం.ఆర్. గత 40 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో క్వాలిటీకి, డిజైన్లకు ప్రత్యేక చిరునామాగా నిలుస్తూ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. సిఎంఆర్ అంటే కుటుంబమంతటికీ మెచ్చే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అని చెప్పారు. అభిమానులతో సెల్ఫీలు తీసుకుని ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపారు.
క్వాలిటీలో రారాజు సీఎంఆర్..
పాయల్ రాజ్ పుత్ అన్ని సెక్షన్లు తిరిగి పరిశీలించారు సి.ఎం.ఆర్. అంటేనే క్వాలిటీలో రారాజన్నారు. ప్రస్తుత తరానికి అనుగుణంగా అన్నిరకాల వెరైటీలు ఉన్నాయన్నారు. ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు అందరికీ అందుబాటు ధరలలో ఉన్నాయని కొనియాడారు. అభిమానులకు అభివాదం చేస్తూ, డ్యాన్సులు చేస్తూ నిజామాబాద్ ప్రజలను ఈ సినిమా స్టార్స్ ఉర్రూతలూగించారు.