Sunday, August 18, 2024
Homeట్రేడింగ్CREDAIbility in Hyderabad for 3 times: క్రెడాయబిలిటీతో హైదరాబాద్ పై క్రెడాయ్ ఫోకస్

CREDAIbility in Hyderabad for 3 times: క్రెడాయబిలిటీతో హైదరాబాద్ పై క్రెడాయ్ ఫోకస్

హైదరాబాద్ నగరంలో 3 ప్రతిష్టాత్మక ప్రాపర్టీ షోలను నిర్వహించనున్న క్రెడాయ్

- Advertisement -

దేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌ల అత్యున్నత సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) త్వరలో నిర్వహించబోయే క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో విశేషాలను వెల్లడించింది. ఈ సంవత్సరం కార్యక్రమం #CREDAIbility (క్రెడాయబిలిటీ) నేపథ్యంతో హైదరాబాద్ నగరం పై దృష్టి సారించి మూడు ఎడిషన్‌లను నిర్వహించనుంది. ఈ వ్యూహాత్మక కార్యక్రమం ద్వారా ఇంటి కొనుగోలుదారులకు నగరం రియల్ ఎస్టేట్ ల్యాండ్‌స్కేప్, సమగ్ర వీక్షణ అందించేలా రూపొందించారు. ఇది ప్రఖ్యాత డెవలపర్‌ల నుండి ఎంపిక చేసిన ఆస్తులను మాత్రమే ప్రదర్శిస్తుంది.

రెండున్నర దశాబ్దాలకు పైగా అనుభవంతో..

హైదరాబాద్ పట్టణాభివృద్ధిని రూపొందించడంలో 25 సంవత్సరాలకుపైగా గొప్ప అనుభవంతో, క్రెడాయ్ హైదరాబాద్ ఈ కార్యక్రమంలో ప్రదర్శించిడిన ప్రతి ఆస్తిలో విశ్వసనీయత, ఆవిష్కరణ, పర్యావరణ అనుకూలతలతో పాటు ఉన్నత ప్రమాణాలు అనుసరించటంలో స్థిరంగా ఉంది. హైదరాబాద్ అంతటా విభిన్న శ్రేణి నివాస-వాణిజ్య ప్రాపర్టీలన్నింటినీ ప్రదర్శిస్తూ, ఒకే చోట బిల్డర్లు-డెవలపర్‌ల అతిపెద్ద సమావేశంగా ఈ ప్రదర్శన జరుగనుంది.

ప్రీమియర్ ప్రాపర్టీ ఈవెంట్ గా..

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 హైదరాబాద్ ప్రీమియర్ రియల్ ఎస్టేట్-ప్రాపర్టీ ఈవెంట్‌గా నిలుస్తుంది. గృహ కొనుగోలుదారులకు వారి నిర్దిష్ట అవసరాలు, లొకేషన్ ప్రాధాన్యతలతో పాటు బడ్జెట్‌కు అనుగుణంగా వారి కలల గృహాలను కనుగొనే అవకాశాన్ని అందించేలా ఈ ఈవెంట్ ఉండనుండటం విశేషం. ప్రముఖ డెవలపర్‌లు-బిల్డర్‌లతో ప్రత్యక్ష చర్చల కోసం ఒక ప్రత్యేక వేదికగా ఈ సమావేశం ఉపయోగపడుతుంది. హాజరైన వారికి అత్యుత్తమ గృహాలు-ప్రత్యేకమైన డీల్‌లను ఒకే చోట అన్వేషించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకంగా క్రెడాయ్ సభ్య డెవలపర్‌ల నుండి రెరా నమోదిత ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తుంది. కొనుగోలుదారులకు పారదర్శకత-విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. సందర్శకులు హైదరాబాద్ డైనమిక్ ల్యాండ్‌స్కేప్‌లో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య స్థలాల విస్తృత శ్రేణిని అన్వేషించవచ్చు.

అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్..

అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌తో హైదరాబాద్‌ను అవకాశాల పరంగా అంతర్జాతీయ నగరంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. భవిష్యత్ మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన స్థిరమైన పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిభావంతులైన శ్రామిక శక్తి ఉన్న ఒక నిజమైన ప్రపంచ నగరంగా హైదరాబాద్‌ నిలుస్తుందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ప్రతిభను ఆకర్షించే అంశాలే ఇవన్నీ అని ఆయన పేర్కొన్నారు. ఈ విశేషమైన లక్షణాలు నైట్ ఫ్రాంక్ ఇండియా-సిఐఐ నివేదిక (2024) ద్వారా ప్రపంచంలో 4వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు పొందేందుకు తోడ్పడ్డాయన్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ (2020) ప్రకారం ఆర్థిక అవకాశాల కోసం ఒక ప్రధాన గమ్యస్థానంగా గుర్తింపు పొందిందని ఆయన గుర్తుచేశారు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ (2022) ప్రకారం టాప్ 10 గ్లోబల్ ఎకోసిస్టమ్‌లలో హైదరాబాద్ కూడా ఉంది.

మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే (2023) ప్రకారం, భారతదేశంలో నివసించడానికి #1 బెస్ట్ సిటీగా హైదరాబాద్ ఆకర్షణ మరింతగా ఈ ప్రశంసలు హైలైట్ చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ (2023) ప్రకారం, ఈ నగరం నివాసితులకు అత్యంత నివాసయోగ్యమైన నగరంగా, భారతదేశంలోని అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా స్థిరంగా ర్యాంక్ పొందుతోంది. జీవించడానికి, పని చేయడానికి, ఆడుకోవడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశంగా భాగ్యనగరం మారింది.

డిసెంబరు 2023, జూన్ 2024 మధ్య హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో ఆస్తి రిజిస్ట్రేషన్లలో 12.5% పెరుగుదల ఉన్నట్లు ఇటీవలి డేటా సూచిస్తుంది. ఆకట్టుకునే విధంగా, ఈ కాలంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ ) పరిమితుల్లో 2.18 లక్షల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి, గత ఏడాది ఇదే సమయ వ్యవధిలో 1.94 లక్షల రిజిస్ట్రేషన్‌లు జరిగాయంటే రియల్ రంగంలో హైదరాబాద్ ఎంత పెద్ద హాట్ కేకో అర్థమవుతుంది.

లగ్జురీ హోమ్స్ కు కేరాఫ్..

సిబిఆర్ఈ నివేదిక (2024) ప్రకారం భారతదేశంలో విలాసవంతమైన గృహాల కోసం మొదటి మూడు మార్కెట్‌లలో హైదరాబాద్ కూడా ఒకటిగా నిలిచింది. ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు స్వల్పంగా 7% పెరిగాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి)చే గ్రీన్ బిల్డింగ్‌లుగా ధృవీకరించబడిన 884 అభివృద్ధి ప్రాజెక్టులు హైదరాబాద్‌లో ఉండగా వీటిలో ఎక్కువ భాగం క్రెడాయ్ సభ్యుల ప్రాజెక్టులే.

సిటీ నేచర్ ఛాలెంజ్ (2024)లో #1 ఇండియన్ సిటీగానూ మారింది. క్యూ2 2024లో, హైదరాబాద్‌లోని 25% రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు గ్రీన్ సర్టిఫికేట్ పొందాయి. ప్రదర్శనలోని అన్ని ప్రాజెక్ట్‌లు గ్రీన్ లివింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే.

అసాధారణ నగరం: జగన్నాథరావు

క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ బి జగన్నాథరావు మాట్లాడుతూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ప్రధాన గమ్యస్థానంగా మాత్రమే కాకుండా నివాసం, పని చేయడానికి సురక్షితమైన అసాధారణమైన నగరం అని నొక్కిచెప్పారు. అత్యున్నత స్థాయి ఇన్ఫ్రా-కనెక్టివిటీ, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఎంఓ.హెచ్.యు.ఏ (MoHUA) అసెస్‌మెంట్ (2021)లో అత్యున్నత ర్యాంక్, గ్లోబల్ సిటీగా నగరం తన హోదాను పటిష్టం చేసుకుందన్నారు.

3 క్రెడాయబిలిటీలు..

క్రెడాయబిలిటీలో రెరా ఆమోదించిన అత్యున్నత ప్రమాణాలున్న అత్యున్నత ప్రాపర్టీలే ప్రదర్శించనుంది.
ఆగస్ట్ 2-4 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో,
ఆగస్టు 9-11 తేదీలలో శ్రీ కన్వెన్షన్స్ కొంపల్లిలో,
ఆగస్టు 23-25తేదీలలో ల్యాండ్ నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఇవి జరుగనున్నాయి
.

గృహ కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ ఔత్సాహికులు క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ప్రదర్శించే అసాధారణమైన ఆస్తుల అన్వేషణలో మార్గదర్శక శక్తిగా క్రెడాయ్ హైదరాబాద్‌ వ్యవహరించనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News