Sunday, December 8, 2024
Homeట్రేడింగ్GEF India launched Freedom Park: ‘ఫ్రీడం పార్క్’ని ప్రారంభించిన జీఈఎఫ్ ఇండియా

GEF India launched Freedom Park: ‘ఫ్రీడం పార్క్’ని ప్రారంభించిన జీఈఎఫ్ ఇండియా

ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని ఎడిబుల్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా ‘ఫ్రీడం పార్క్’ ని ప్రారంభించింది. కూకట్‌పల్లి, చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలకు విశ్రాంతి తీసుకోవడానికి, వ్యాయామం చేయడానికి, ఆడుకోవడానికి, బంధాలను పెంచుకోవటానికి ప్రత్యేకంగా రూపొందించిన హరిత ప్రాంగణం ఇది. ఈ పార్క్‌ను అక్షయ్ చౌదరి, జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, జీఈఎఫ్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) నుండి ప్రతినిధులు మరియు స్థానిక నివాసితుల హాజరయ్యారు.

- Advertisement -

జీఈఎఫ్ ఇండియా ఈ ఫ్రీడం పార్క్‌ను రూ. 2.76 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. ఇది జాగింగ్/వాకింగ్ ట్రాక్, ఒక యాంఫీథియేటర్, కమ్యూనిటీ సమావేశాల కోసం కవర్ జోన్, ప్రకాశవంతమైన, రంగురంగుల స్వింగ్‌లతో కూడిన ప్రత్యేక పిల్లల ఆట స్థలం, బహిరంగ వ్యాయామశాల కోసం పరికరాలు, యోగా జోన్, బెంచీలు, వాష్‌రూమ్, పార్కులో ఆకర్షణీయమైన ల్యాండ్‌ స్కేపింగ్‌ కలిగి వుంది. ఇది కాంక్రీట్ జంగిల్ మధ్య స్వాగతించే ఏకాంత ప్రదేశంగా నిలుస్తుంది.

ఈ కార్యక్రమం తాము నివసించే, పని చేసే కమ్యూనిటీల నడుమ ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించాలనే జీఈఎఫ్ ఇండియా అంకితభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. విస్తారమైన సౌకర్యాలతో, వినోదం, ఆరోగ్యం, సామాజిక అనుసంధానిత కోసం ప్రతిష్టాత్మకమైన వనరుగా ఈ పార్క్ మారింది, నిర్మలమైన ఆకుపచ్చ వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రకృతితో మమేకం కావడానికి నివాసితులను ఆహ్వానిస్తుంది.

అక్షయ్ చౌదరి, జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, “బాహ్య కార్యకలాపాలు, కుటుంబ సమావేశాలు మరియు ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే సురక్షితమైన స్వాగతించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఫ్రీడమ్ పార్క్ వినోదం, సామాజిక అనుసంధానిత కోసం ఒక ముఖ్యమైన వనరుగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ కమ్యూనిటీని మరింత దగ్గరకు తీసుకురావడానికి సహాయపడుతుంది. నివాసితులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రకృతితో కనెక్ట్ అయ్యే స్వర్గధామంగా మేము దీనిని భావిస్తున్నాము ” అని అన్నారు.

జెమినీ ఎడిబుల్స్ & ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్, సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్ర శేఖర రెడ్డి మాట్లాడుతూ, “ఫ్రీడమ్ ఆయిల్‌ వద్ద , ప్రజలు ఆరోగ్యంగా తినడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ప్రోత్సహించడాన్ని మేము విశ్వసిస్తున్నాము. జీహెచ్ఎంసీతో మా భాగస్వామ్యం ద్వారా కూకట్‌పల్లి నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా సమాజం, శ్రేయస్సు, భావాన్ని పెంపొందించే ప్రాంగణం ఏర్పడింది. ఫ్రీడమ్ ఆయిల్ పార్క్ అందరికీ ప్రియమైన గమ్యస్థానంగా అభివృద్ధి చెందడం, ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా వారిని ప్రోత్సహించడం పట్ల మేము సంతోషిస్తున్నాము..” అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News