Homeట్రేడింగ్Trend: గ్లామ్ డ్రాప్ సిరీస్ ట్రెండ్

Trend: గ్లామ్ డ్రాప్ సిరీస్ ట్రెండ్

Trend: నవరాత్రికి వస్తున్న గ్లామర్ ట్రెండ్లు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది గ్లామ్ డ్రాప్ సిరీస్ అంటూ వచ్చిన నవరాత్రి నెయిల్ ట్రెండ్ భలే ఆకట్టుకుంటోంది. ప్రెస్-ఆన్ నెయిల్స్ ట్రెండ్ లో ఇది సరికొత్త ఆకర్షణగా నిలిచే ట్రెండ్ గా మారింది. రంగుల గోర్లు మాత్రమే కాదు వాటికి ఎన్ని సొబగులో. ఆఖరుకి వజ్రాలు, బంగారు, వెండి, నగిషీలు..ఒకటేమిటి నగల అలంకరణంతా గోళ్లపైన ధగధగలాడేలా ట్రెండ్లు వచ్చాయి.

- Advertisement -

వేలాడే జూకాలు, మెరిసే స్టోన్స్ తో ప్రెస్-ఆన్ నెయిల్స్ కావల్సిన బడ్జెట్ లో వచ్చాయి. ఆన్లైన్, ఆఫ్ లైన్లో చాలా పెద్ద వ్యాపారంగా మారిన ఈ గ్లామ్ డ్రాప్ నెయిల్స్ కాలేజ్ విద్యార్థులే కాదు అన్ని వయసుల వారు హ్యాపీగా ట్రై చేస్తున్నారు. గర్భా-దాండియా డ్యాన్స్ చేసే క్రమంలో ఇలాంటి నెయిల్ ట్రెండ్స్ కొత్త లుక్ ఇస్తాయి. స్టైల్ కోషంట్ పెంచేందుకు ఇలాంటి ట్రెండ్స్ సూపర్ గా పనికొస్తాయి. హెరిటేజ్ ఇన్ స్పైర్డ్ మిర్రర్ స్టైల్, నవరత్నాలు పొదిగిన ఇలాంటి నెయిల్ డ్రాప్స్ వావ్ ట్రెండ్ గా వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News