Tuesday, November 5, 2024
Homeట్రేడింగ్Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు

Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు

Gold Rates| భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో కచ్చితంగా బంగారం పెట్టుకోవాల్సిందే. అంతలా మన జీవితాల్లో బంగారం భాగమైపోయింది. అయితే ఇటీవల గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ఎప్పుడూ లేని విధంగా 10 గ్రాముల ధర ఏకంగా రూ.81వేలకు పైగా చేరుకుంది. దీంతో గోల్డ్ కొనేందుకు పసిడి ప్రియులు కాస్త వెనక్కాడారు. అలాంటి వారికి ఈ వార్త శుభవార్త అని చెప్పాలి. తాజాగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు మరోసారి పతనం అయ్యాయి. ఈ క్రమంలో దేశీయంగానూ బంగారం ధరలు దిగొచ్చాయి.

- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,300 తగ్గి రూ. 81,100కి పడి పోయిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అలాగే స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,400 వద్ద ట్రేడవుతోందని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,390గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,690గా ప‌లుకుతుంది. మరోవైపు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. దీంతో కిలో వెండి ధర రూ. 95,000 మార్క్ దిగువకు పడిపోయింది. దీంతో పసిడి కొనుగోళ్లకు ఇదే మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News