బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరికీ ఇష్టం. కానీ ఈ ధరలు పెరగడాలు, తగ్గడాలు చూసి ప్రజలకు ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్ముకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. గోల్డ్ ధరలు పెరిగినప్పుడు, ప్రజల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ పెరుగుదల ముఖ్యంగా మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలకు తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మన దేశంలో బంగారం ఒక ప్రాధాన్యమైన ఆస్తిగా భావిస్తారు. కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి గోల్డ్ సేవింగ్‌లు ఎక్కువగా వినియోగిస్తారు. కానీ గోల్డ్ ధరల పెరుగుదలతో, బంగారం కొనడం సాధ్యమే కాని పని అవుతుంది.
గోల్డ్ ధరల పెరిగినప్పుడు, బంగారం కొనే అవకాశం చాలా మందికి తగ్గిపోతుంది. ముఖ్యంగా వివాహాలు, ఉత్సవాలు, ఇతర ముఖ్యమైన సందర్భాలలో బంగారం కొనే అవసరం పెరిగినప్పటికీ, ధరలు అధికంగా ఉండడం వల్ల అది మరింత కష్టంగా మారుతుంది. వివాహాల సమయంలో ఆభరణాల
కొనుగోళ్లకు తగిన స్థాయిలో ఆర్థిక బరువు పడుతుంది.
అయితే నిన్న 22 క్యారట్ల బంగారం ధర ఒకేసారి ఏకంగా రూ.120 లు పెరిగి 1 గ్రాము రూ.7730 కి చేరుకుంది. అంటే పది గ్రాముల ధర రూ. 77,300 గా ఉంది. అదే ఈరోజు 22 క్యారట్లు ధర రూ.15 పెరిగి ఒక గ్రాము బంగారం ధర రూ.7,745 దగ్గర ఉంది. అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 77,450 కు చేరుకుంది.
అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.131 పెరిగి ఒక గ్రాము బంగారం ధర రూ.8,433 కి చేరింది. అంటే పది గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 84,330 గా ఉంది. ఈరోజు 24 క్యారట్ల రూ.16 పెరిగి ఒక గ్రాము రూ.8,449 కి చేరింది. అంటే 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 84,490 గా ఉంది. ఈ ధరలు బడ్జెట్ తర్వాత మరింత మార్పులు జరిగే అవకాశం ఉంది.