Gold Rates| బంగారం ప్రియులకు నిజంగానే అదిరిపోయే వార్త. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు ఊహించని రీతిలో తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.82వేలకు చేరువకు రాగా.. ఇప్పుడు రూ.79వేలకు దిగువకు వచ్చింది. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం అని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాయ బులియన్ మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యకంలో దేశీయంగానూ ధరలు దిగొచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.1790 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,000గా నమోదుకాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,560గా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.3000 తగ్గి.. ప్రస్తుతం రూ.93,000 వద్ద కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లక్ష రెండు వేలు రూపాయలుగా ఉంది. అమెరికా ఎన్నికల ఫలితాలే ధరల తగ్గుదలకు కారణమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,000
విజయవాడ – రూ.72,000
చెన్నై – రూ.72,000
బెంగళూరు – రూ.72,000
కేరళ – రూ.72,000
ముంబై – రూ.72,000
కోల్‌కతా – రూ.72,000
ఢిల్లీ – రూ.72,150
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,560
విజయవాడ – రూ.78,560
చెన్నై – రూ.78,560
బెంగళూరు – రూ.78,560
కేరళ – రూ.78,560
ముంబై – రూ.78,560
కోల్‌కతా – రూ.78,560
ఢిల్లీ – రూ.78,710
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,02,000
విజయవాడ – రూ.1,02,000
చెన్నై – రూ.1,02,000
కేరళ – రూ.1,02,000
కోల్‌కతా – రూ.93,000
బెంగళూరు – రూ.93,000
ఢిల్లీ – రూ.93,000
ముంబై – రూ.93,000