Sunday, December 8, 2024
Homeట్రేడింగ్Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. రూ.81వేలు దాటేసిన బంగారం ధరలు

Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. రూ.81వేలు దాటేసిన బంగారం ధరలు

Gold Rates| దీపావళి పండుగకు బంగారం కొనుగోలు చేయాలనుకున్న పసిడి ప్రియులకు షాక్ తగిలేలా ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్న క్రమంలో దేశీయంగానూ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువ రూ. 84.06 వద్ద ఉంది. ఇప్పటికే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80వేలు దాటగా.. ఇప్పుడు ఏకంగా రూ.81వేలు దాటేసింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగార ధర రూ.650 పెరిగి రూ.74,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.710 పెరిగి రూ.81,160గా ఉంది.

- Advertisement -

ఇదిలా ఉంటే వెండి ధరలు బంగారం ధరలతో పోటీ పడుతున్నాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.1,00,175 ఉండగా.. ఒక్క రోజులోనూ రూ.810 పెరిగి రూ.1,00,985కు చేరింది. దీంతో బంగారం, వెండి కొన్నాలన్నా వినియోగదారులు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.74,400
విజయవాడ – రూ.74,400
చెన్నై – రూ.74,400
బెంగళూరు – రూ.74,400
కేరళ – రూ.74,400
ముంబై – రూ.74,400
కోల్‌కతా –రూ.74,400
ఢిల్లీ – రూ.74.550

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.81,160
విజయవాడ – రూ.81,160
చెన్నై – రూ.81,160
కేరళ – రూ.81,160
బెంగళూరు – రూ.81,160
ఢిల్లీ – రూ.81,310
ముంబై – రూ.81,160
కోల్‌కతా – రూ.81,160

కిలో వెండి ధరలు:

హైదరాబాద్ – రూ.1,09,000
విజయవాడ – రూ.1,09,000
చెన్నై – రూ.1,09,000
బెంగళూరు – రూ.1,00,000
కేరళ – రూ.1,09,000
కోల్‎కతా – రూ.1,00,000
ఢిల్లీ – రూ.1,00,000
ముంబై – రూ.1,00,000


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News