Friday, November 22, 2024
Homeట్రేడింగ్Hi Life Jewellery exhibition: హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక హై లైఫ్ జువెల్రీ షో

Hi Life Jewellery exhibition: హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక హై లైఫ్ జువెల్రీ షో

వావ్ అనిపించే కలెక్షన్, కళ్లు చెదిరేలా..

భారతదేశం అత్యంత ప్రశంసలు పొందిన జ్యువెలరీ షో, హాయ్ లైఫ్ జువెల్స్ సెప్టెంబరు 14, 15, 16 తేదీల్లో నోవోటెల్ లో తిరిగి వస్తోంది. ఈ అద్భుతమైన ప్రపంచ ఆభరణాల ఎక్స్ పోలో పాల్గొనడానికి సిద్ధమయ్యేందుకు ఫ్యాషన్ ప్రియులు రెడీ అవుతున్నారు.

- Advertisement -

  హాయ్ లైఫ్ జువెల్స్ అనేది 100కి పైగా ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌లను ఒకే చోట తీసుకువచ్చే అద్భుతమైన ప్రదర్శన. ఇది భారతీయ స్త్రీకి సంపన్నమైన ఆభరణాల పట్ల ఉన్న ప్రేమను చాటేలా ఉంటుంది. భారతీయ మహిళా స్టైల్స్ కు కేరాఫ్ గా ఈ ఎగ్జిబిషన్ ఉండనుంది, విలాసవంతమైన బ్రైడల్ జ్యువెలరీ, అకేషన్ జ్యువెలరీ కోసం షాపింగ్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ సరైన స్థలం కావటంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఎంతోమంది ఉత్సాహంగా ఈ షోకు హాజరవుతారు.

హాయ్ లైఫ్ జ్యువెల్స్‌లో జువెల్రీ షోతో పాటు ఇంకా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. టైంలెస్ క్లాసిక్‌ యాంటిక్ జ్యువెలరీ, పోల్కీ-కుందన్ జ్యువెలరీ, కాంటెంపరరీ జువెలరీతో పాటు గొప్ప ఆభరణాలు ఇక్కడ ఆకట్టుకోనున్నాయి. ప్రతి ఫ్యాషన్‌ లవర్ హృదయంలో హై లైఫ్ షోకు ప్రత్యేక స్థానం దక్కేలా నిర్వాహకులు ఈ ఈవెంట్ ను గొప్పగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు.

హాయ్ లైఫ్ జ్యువెల్స్, హైదరాబాద్ దాని తదుపరి ఎడిషన్‌ను 14, 15, 16 సెప్టెంబర్‌లలో నోవాటెల్ వేదికగా కళ్లు చెదిరేలా సాగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News