బెస్ట్ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ టీం అఫ్ ది ఇయర్ గా అవార్డును అందుకుంది భారతి సిమెంట్ టీం. ఈమేరకు టీం సభ్యులు విజయ్ కుమార్, పవన్ కుమార్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ లో బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ, ఈ & సీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ వైస్ చైర్మన్ & ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ లయన్ వై కిరణ్ (హానరరీ కాన్సుల్ ఆఫ్ బల్గేరియా & సీఈవో – సుచిరిండియా గ్రూప్), రవీందర్ రెడ్డి (మార్కెటింగ్ డైరెక్టర్ – భారతి సిమెంట్), వేణు వినోద్ (మేనేజింగ్ డైరెక్టర్ – సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్), ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ & తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ – హై బిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.