స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్, ఎస్బీఐ కమర్షియల్ క్లయింట్స్ గ్రూప్ తో కలిసి ఖాతాదారుల కోసం ఎగుమతిదారుల సమావేశాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్- ASF) సురేందర్ రాణా పాల్గొన్నారు. రవి రంజన్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ మార్కెట్స్, స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ నుండి టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ కస్టమర్లు, ప్రముఖులు, ఉన్నతాధికారులకు స్వాగతం పలికారు.
మన ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎగుమతుల ప్రాముఖ్యతను నొక్కిచెప్పి, ఫార్మాస్యూటికల్స్, ఐటీ-ఐటీఈఎస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలలో ముఖ్యంగా ఎగుమతి రంగంలో ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రం సహకారాన్ని హైలైట్ చేశారు. ఈ సమావేశం అధిక విలువ కలిగిన కార్పొరేట్‌లు, ఎంఎస్ఎంఈ క్లయింట్‌ల మధ్య సమ్మేళనం, సహకారానికి ఒక ప్రత్యేక వేదికను అందిస్తుంది అని ఆయన నొక్కిచెప్పారు. తెలంగాణకు చెందిన దాదాపు 120 మంది అధిక విలువైన ఎగుమతిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్ మార్కెట్స్ బృందం ఫారెక్స్ ఉత్పత్తులపై ప్రదర్శన సైతం నిర్వహించటం హైలైట్.
వినియోగదారులను ఉద్దేశించి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్-రిటైల్-ఏఎస్ఎఫ్ సురేందర్ రాణా చేసిన ప్రసంగంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి తయారీ రంగం వృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భారతదేశం 2030 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఎగుమతులనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి అన్ని వాటాదారుల నుండి సహకారాన్ని అభ్యర్థించింది. దేశ జిడిపిలో స్థిరమైన వృద్ధికి తయారీ రంగం వృద్ధిలో ఎగుమతిదారులకు పెద్ద పాత్ర ఉందని ఆయన నొక్కి చెప్పారు.
దేశ ఎగుమతులలో తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న పాత్రను గ్లోబల్ మార్కెట్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రవి రంజన్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర వృద్ధి జాతీయ జిడిపి వృద్ధిని మించిపోయిందని ఆయన హైలైట్ చేశారు.