Thursday, April 10, 2025
Homeట్రేడింగ్Integrated Scholarship by Jain International Residential: జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్...

Integrated Scholarship by Jain International Residential: జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌షిప్

బెంగళూరుకు చెందిన జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ (జేఆర్ఐఎస్), ది స్పోర్ట్స్‌ స్కూల్ సహకారంతో భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, ఫ్యూచర్ 25ని ప్రారంభించనుంది.

- Advertisement -

హైదరాబాద్ లో తొలి ప్రోగ్రాం

8 మెట్రో నగరాల్లో నిర్వహించే ఈ కార్యక్రమం మొదటి వేడుకను నవంబర్ 23న సికింద్రాబాద్‌లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్‌లో జరిగింది. బ్యాడ్మింటన్ లెజెండ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, టెన్నిస్ క్రీడాకారుడు పద్మశ్రీ రోహన్ బోపన్న, క్రికెట్ ఐకాన్ రాబిన్ ఉతప్ప వంటి స్పోర్ట్స్ స్కూల్ నుండి భాగస్వాములు మరియు మెంటార్‌లతో రాబిన్ ఉతప్పలాంటి భాగస్వాములుగా, మెంటార్లుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి జేయారెస్ పూర్వ విద్యార్థులతోపాటు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సీనియర్ కోచ్ అనిల్ కుమార్ తదితరులు హాజరు కానున్నారు.

క్రీడల్లోనూ రాణించాలి

ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందన్నారు తాను పాఠశాలకు వెళ్లి సమయంలో మంచి క్రికెటర్నని అవకాశాలు తక్కువగా ఉండడంతో తాను ఆ వైపు వెళ్లలేకపోయారని అన్నారు. అతి తక్కువ పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశానని అన్నారు. జెఎన్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చెన్రాజ్ రాయిచంద్ మాట్లాడుతూ జైన్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసి పాతికేళ్లు గడుస్తున్నా సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. విద్యతోపాటు చదువులో రాణించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్టు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News