Thursday, October 31, 2024
Homeటెక్ ప్లస్Jio Payment: త్వరలో మార్కెట్‌లోకి జియో పే.. ఫోన్ పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా..?

Jio Payment: త్వరలో మార్కెట్‌లోకి జియో పే.. ఫోన్ పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా..?

Jio Payment| రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే టెలికాం రంగంలో జియో(Jio) సిమ్‌తో సంచలనాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి తక్కువ ధరకే ఇంటర్‌నెట్ సదుపాయం తీసుకొచ్చారు. ఈ దెబ్బతో పోటీదారులైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు ఫిన్ టెక్ రంగంలోనూ సంచనాలు నమోదుచేసేందుకు జియో సిద్ధమైంది.

- Advertisement -

టెలికాం, ఏయిర్ ఫైబర్, బ్రాడ్ బ్రాండ్ వంటి ఇంటర్నేట్ సేవలు అందిస్తున్న జియో.. తాజాగా యూపీఐ సేవలు అందించేందుకు రంగం సిద్దం చేసింది. భారతీయులకు ఆన్‌‌లైన్ పేమెంట్స్ సేవలను సులభతరం చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) సేవల్లోకి అడుగుపెట్టుడుతున్నట్లు జియో ప్రకటించింది. ఈ క్రమంలోనే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగంగా జియో పేమెంట్(Jio Payment) సొల్యూషన్స్‌కు ఆర్బీఐ(RBI) అనుమతి ఇచ్చింది. దీంతో ఇకపై జియోతో డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు లైన్ క్లియర్ అయింది.

ఆర్బీఐ అనుమతితో ఇక నుంచి త్వరలో జియో పేమెంట్స్ యాప్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. యూపీఐ రంగంలోకి జియో రాకతో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేలు కూడా త్వరలో గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా జియో పేమెంట్స్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇ-వాలెట్లు, ఇతర సేవలను అందిస్తున్న విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News