Saturday, November 23, 2024
Homeట్రేడింగ్Kanchipuram Mangala Gauri new branch launched: కాంచీపురం మంగళగౌరీ సరికొత్త బ్రాంచ్

Kanchipuram Mangala Gauri new branch launched: కాంచీపురం మంగళగౌరీ సరికొత్త బ్రాంచ్

సరసమైన ధరల్లో మేలైన వెరైటీలు కేరాఫ్ మంగళ గౌరి

కాంచీపురం మంగళ గౌరీ అత్తాపూర్ లోని మెట్రో పిల్లర్ నంబర్ 142 కి ఎదురుగా తమ సరికొత్త బ్రాండ్ మంగళ గౌరీ షాపింగ్ మాల్ కు 2024 జులై 13వ తేదీనాడు శుభారంభం చేసింది. జంట నగరాలలోని సర్వోత్తమ షో రూముల్లో ఒకటైన మంగళ గౌరీ షాపింగ్ మాల్ కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులకు అనువైన అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఓకేచోట సమగ్రంగా అందజేసే విధంగా రూపొందింది. ఇందులో అత్యంత విస్తారమైన మెన్స్ వేర్ , వుమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ ఫరియా..
ప్రముఖ టాలీవుడ్ తార ఫరియా అబ్దుల్లా, ప్రముఖ యాంకర్ సుమ కనకాల సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ ..“అద్భుతమయిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది” అంటూ ఇంత అందమైన, అన్ని బ్రాండులూ అందుబాటులో ఉండే అత్యంత సౌకర్యవంతమైన షో రూమును అత్తా పూర్ లో నెలకొల్పిన డైరెక్టర్ల ను
అభినందించారు.

కేజీ సేల్, 50 శాతం డిస్కౌంట్ ప్రారంభించిన ఫరియా..

ఇదే సందర్భంలో ఫరియా మంగళ గౌరీ షాపింగ్ మాల్ వారి ఆషాడం KG సేల్ 50% వరకు తగ్గింపు ఆఫర్ ను కూడా ప్రారంభించారు. ఈ ఆఫర్ అన్ని వస్త్రాలపై అందుబాటులో ఉండటం విశేషం.
యాంకర్ సుమ కనకాల మంగళ గౌరీ షాపింగ్ మాల్ లోని అన్ని విభాగాలలోని లేటెస్ట్ కలెక్షన్స్ ను సందర్శించి, అన్ని వెరైటీలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అత్తాపూర్ ఆ పరిసరాల వారు తమ అభిరుచులకు, అవసరాలకు సరిపడే వైవిధ్య భరిత వస్త్ర మరియు వస్తు శ్రేణి కోసం మంగళ గౌరీ షాపింగ్ మాల్ ను సందర్శించి అపురూపమైన షాపింగ్ అనుభూతిని పొందగలరని, ముఖ్యంగా వివాహాది శుభ కార్యాలకు, ప్రత్యేకమైన వేడుకలకు మంగళ గౌరీ షాపింగ్ మాల్ ఎంతో సౌకర్యంగా ఉంటుందని యాంకర్ సుమ అన్నారు.

దక్షిణాదిన ఇతర సిటీల్లో విస్తరణ..

తమ బ్రాండ్ కు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి మంగళ గౌరీ షాపింగ్ మాల్ సంస్థ కృష్ణమూర్తి మీడియాకి వివరిస్తూ.. దక్షిణ భారత దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు తమ బ్రాండ్ ను త్వరలో విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ముఖంగా వెడ్డింగ్ కలెక్షన్స్ లో పోటీ ధరలకు నాణ్యమైన వస్త్ర శ్రేణిని అందజేయడం తమ లక్ష్యమని చెప్పారు. తమ షో రూములో అన్ని తరాల కుటుంబ సభ్యుల అభిరుచులకు సరిపడే 4 లక్షల వెరైటీలు లభిస్తున్నాయని, ఆషాఢం కేజీ సేల్ ను ప్రారంభోత్సవ ఆఫర్ గా అందజేస్తున్నామని కృష్ణమూర్తి అన్నారు.

ఎన్నో వెరైటీలు ఒకే చోట..

తమ శారీ కలెక్షన్ లో అనేక రకాల పట్టు చీరలు ప్రత్యేకంగా ఉన్నాయని వీటిలో కంచిపట్టు, ధర్మవరం , అరణి, ఉప్పాడ, వెంకటగిరి , గద్వాల్, పోచంపల్లి, మహేశ్వరి, కోయంబత్తూరు, కోల్కతా, బెనారస్, ఇంకా హై ఫ్యాన్సీ శారీ వెరైటీలు, ప్యూర్ అర్గంజా, ప్యూర్ ఖాదీ జార్జెట్, ఫ్లోరల్ ప్రింట్స్, బిన్నీ క్రేప్ సిల్క్ వంటి అనేక రకాలు లభిస్తున్నాయని, అదేవిధంగా విస్తృతమైన రకాలకు చెందిన మెన్స్ వేర్ కిడ్స్ వేర్, ఎత్నిక్ వేర్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని కృష్ణమూర్తి మీడియాకి వివరింరించారు. రానున్న పండగలు వివాహాది శుభ కార్యాల సీజన్ లకు అత్తాపూర్ వాసులు తమ మంగళ గౌరీ షాపింగ్ మాల్ కి విచ్చేసి అద్భుతమైన ఆఫర్లతో పాటు సరసమైన ధరలకు నాణ్యమైన వస్త్రాలను కొనుగోలు చేయగలరని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News