హైదరాబాద్ లో లలితా జువెలర్స్ 55వ షోరూం సుచిత్రా సర్కిల్ లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈమేరకు లలితా జువెలరీ సంస్థ పలు ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టినట్టు సంస్థ వెల్లడించింది. తయారీ ధరకే బంగారు, వజ్రాభరణాలను అందించేందుకు లలిత సిద్ధంగా ఉందని, నగల తయారీలో తమకు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని సంస్థ సగర్వంగా ప్రకటించింది. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ షోరూం ప్రారంభం కానుంది.
ఆగస్టు 18న సుచిత్రల్లో అందుబాటులోకి వచ్చే లలిత జువెలరీ షోరూంలో తక్కువ తరుగు, తక్కువ ధరలో లైట్ వెయిట్ నగలు హైలైట్. లలిత వారి ధన వందనం 11 నెలల నగల కొనుగోలు పథకం ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ అయింది.
వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, భీమవరం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేటతో పాటు హైదరాబాద్ లోని కూకట్ పల్లి, సోమాజిగూడ, దిల్ సుఖ్ నగర్, చందానగర్ తో పాటు తాజాగా సుచిత్ర ప్రాంతంలోనూ లలిత జువెలర్స్ అందుబాటులోకి రానుంది.