Sunday, September 8, 2024
Homeట్రేడింగ్Lay-offs: బైజూస్ లో సెకెండ్ రౌండ్ లే ఆఫ్స్, ఏడాదిలో రెండోసారి ఇలా

Lay-offs: బైజూస్ లో సెకెండ్ రౌండ్ లే ఆఫ్స్, ఏడాదిలో రెండోసారి ఇలా

వర్చువల్ క్లాసులంటూ పైసా వసూల్ బిజినెస్ చేస్తున్న ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్ బైజూస్ మరో దఫా ఉద్యోగులను సాగనంపే పనిలో పడింది. ఈసారి ఏకంగా 1,000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెబుతోంది బైజూస్. ఆరు నెలలు కూడా తిరగకముందే మళ్లీ ఇలా ఉద్యోగుల సంఖ్యను కుదించే పనిలో పడ్డ బైజూస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం మాత్రం భారీగా ఖర్చు చేస్తోంది.

- Advertisement -

ఎలాగైనా మార్చ్ 2023కల్లా లాభాల బాట పట్టాలన్న యోచనతో ఇప్పటిక 2,500 మందిని తొలగించిన కంపెనీ మళ్లీ లే ఆఫ్స్ అంటోంది. ప్రపంచంలోనే అత్యధిక విలువైన ఎడ్యు టెక్ స్టార్టప్ గా పాపులర్ అయిన బైజూస్ లో ఆమధ్య 10,000 మంది టీచర్లను నియమించుకుంటామంటూ భారీ ప్రకటనలు మాత్రం చేశారు. కానీ ఇప్పుడు పింక్ స్లిప్స్, లే ఆఫ్స్ అంటూ బైజూస్ లో ఉద్యోగ భరోసా అస్సలుండదనే విషయాన్ని మరోమారు తేటతెల్లం చేస్తోంది బైజూస్ యాజమాన్యం. ఒక బిలియన్ డాలర్ల మేర పబ్లిక్ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉంది బైజూస్. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ తో కలిసి ఈ ఐపీఓకు బైజూస్ రెడీ అవుతున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News