Friday, November 22, 2024
Homeట్రేడింగ్Lay-offs: మైక్రోసాఫ్ట్ లో 10,000, అమెజాన్ లో 18,000 మంది ఉద్యోగుల తొలగింపు

Lay-offs: మైక్రోసాఫ్ట్ లో 10,000, అమెజాన్ లో 18,000 మంది ఉద్యోగుల తొలగింపు

ఆన్ లైన్ సేల్స్ తగ్గుముఖం పట్టాయన్న సాకుతో అమెజాన్ లో మొట్టమొదటిసారి భారీ ఎత్తున ఉద్యోగులను సాగనంపుతున్నారు. అమెజాన్ లో వివిధ డిపార్టమెంట్స్ లోని 18,000 మందికి పైగా ఉద్యోగులను వదిలించుకునే ప్రక్రియ స్టార్ట్ అయింది. నిజానికి గతేడాదే అమెజాన్ లో లే-ఆఫ్స్ స్టార్ట్ అయినప్పటికీ మరో లేటెస్ట్ రౌండ్ కూడా సాగుతోంది. దీని ప్రభావం రీటైల్ డివిజన్ మీద భారీగా ఉండచ్చు. అమజాన్ వర్క్ ఫోర్స్ లో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ దాని ప్రభావం భారీగా సర్వీసులపై పడనుంది.

- Advertisement -

ఇటు మరో టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ కార్ప్ కూడా ఇదే పనిలో ఉంది. 10,000 మందికి పైగా జాబ్ కట్స్ అమల్లోకి తెస్తున్నట్టు ఖర్చుల భారాన్ని తగ్గించుకోవటమే తమ లక్ష్యమని, ఇదంతా 2023 ఫిస్కల్ ఇయర్ మూడవ క్వార్టర్ లోగా అమలు చేస్తామని మైక్రోసాఫ్ట్ తేల్చి చెప్పింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అమెరికాలోనే ఎక్కువగా ఈ ఉద్యోగ కోతలు ఉంటాయని కూడా సంస్థ వివరించింది. ఈ నిర్ణయంతో మైక్రోసాఫ్ట్ షేర్ ప్రాఫిట్ 12శాతంమేర పడిపోయిందని సంస్థ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ ప్రాడక్ట్స్ కు డిమాండ్ తగ్గటం కూడా ఈ కఠిన నిర్ణయాలకు కారణం. మైక్రోసాఫ్ట్ లో మొత్తం 221,000మంది ఫుల్ టైం ఉద్యోగులుండగా వారిలో 122,000మంది అమెరికాలో ఉంటున్నారు.. మరో 99,000మంది ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు.

ప్రపంచంలోని టెక్ దిగ్గజాలైన సిస్కో సిస్టమ్స్, ఇంటెల్ కార్ప్, మెటా ప్లాట్ ఫార్మ్స్, కాల్ కామ్, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలన్నీ ఉద్యోగులను పెద్ద ఎత్తున సాగనంపుతూ కాస్ట్ కటింగ్ చర్యలు వేగవంతం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News