Sunday, September 8, 2024
Homeట్రేడింగ్Lay-offs: పే పాల్ కాస్ట్ కటింగ్.. భారీగా లే ఆఫ్స్

Lay-offs: పే పాల్ కాస్ట్ కటింగ్.. భారీగా లే ఆఫ్స్

బిగ్ టెక్ ఫర్మ్స్ అన్నీ కాస్ట్ కటింగ్, లే ఆఫ్స్ రూట్ లో ఉండగా పే పాల్ కూడా ఈ బాటలో చేరింది. వాల్ స్ట్రీట్ టైటన్స్ అనుసరిస్తున్న మార్గంలోనే పోక తప్పదని పే పాల్ స్పష్టంచేస్తోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికన్ కార్పొరేట్ కంపెనీలన్నీ లే ఆఫ్స్ అంటూ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నారు. తాజాగా పేమెంట్స్ ఫర్మ్ పే పాల్ లోనూ 7 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. అంటే 2,000 మంది పే పాల్ ఉద్యోగులకు ఉద్యోగం ఊడుతుందన్నమాట. యూఎస్ ఈ కామర్స్ బిజినెస్ పెద్దగా లేకపోవటంతో ఈ ఫిన్ టెక్ కంపెనీ నష్టాల్లోకి వెళ్తుందని ముందస్తు అంచనాల నేపథ్యంలోనే ఇదంతా సాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News