రేయింబవళ్లు డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా ఎల్ఐసీ వన్ మ్యాన్ ఆఫీస్ ను ప్రారంభించింది. పాలసీదారులకు 24 x 7 ప్రాతిపదికన డిజిటల్‌గా సేవలను అందించేలా వన్ మ్యాన్ ఆఫీస్ (OMO) ఆన్‌లైన్ సేవను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. వన్ మ్యాన్ ఆఫీస్ ద్వారా, ఏజెంట్లు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, సీనియర్ బిజినెస్ అసోసియేట్‌లు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు, అసోసియేట్‌లు, చీఫ్ ఆర్గనైజర్‌లతో కూడిన సమగ్ర డిజిటల్ పర్యావరణ వ్యవస్థ అందించటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సేల్స్ ఫోర్స్ చేతుల్లో ఇది కీలక సాధనంగా మారనుందని సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి అన్నారు. ‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఒక ముందడుగు అవుతుందని సిద్ధార్థ అన్నారు.
మారుతున్న అవసరాలను తీర్చడానికి దశలవారీగా ఈ అప్లికేషన్‌కు మరిన్ని ఫీచర్లను జోడించాలని ఎల్ఐసీ యోచిస్తోంది.
LIC: వన్ మ్యాన్ ఆఫీస్ ఆవిష్కరించిన ఎల్ఐసీ
24X7 సర్వీసెస్