Friday, November 22, 2024
Homeట్రేడింగ్Lucknow: 'గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్' కు అదానీ డుమ్మా

Lucknow: ‘గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్’ కు అదానీ డుమ్మా

యావత్ దేశమంతా ఆసక్తిగా చూసిన ‘ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్’ కి అదానీ డుమ్మా కొట్టారు. యోగీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ పాల్గొంటారని అందరూ భావించారు. కానీ ఆయన ఈ పెట్టుబడుల సదస్సుకు హాజరు కాలేదు.

- Advertisement -

లక్నోలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటివారంతా ఈ సదస్సులో పాల్గొని యూపీలో పెట్టనున్న వేల కోట్ల పెట్టుబడులపై అధికారిక ప్రకటన చేస్తున్నారు. కాగా యూపీలో సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు, ఈమేరకు అధికారిక ప్రకటన చేసేందుకు అదానీ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని యూపీ సర్కారు వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News