బ్యాంకింగ్ సేవల్లో ప్రథమంలో ఉండే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వినియోగదారులకు మరిన్ని సేవలందించే లక్ష్యంతో సరికొత్త బ్రాంచులతో విస్తరిస్తోంది. మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా, చింతల్‌లో అత్యాధునిక శాఖలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రారంభించింది. ఈ శాఖలను ప్రారంభించడంతో బిఒఎం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 71 శాఖలను కలిగి ఉంది. చింతల్ బ్రాంచ్ అన్ని బ్యాంకింగ్ లావాదేవీలను, కస్టమర్ల నిర్దిష్ట అవసరాలను కూడా తీరుస్తుంది. రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఇ రంగాలను కవర్ చేసే బ్యాంకింగ్ ఉత్పత్తులను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ జిఎస్డి ప్రసాద్, టీం చింతల్ సమక్షంలో బాలానగర్‌లోని డిసిపి కె సురేష్ కుమార్ ఐపిఎస్ చేతుల మీదుగా చింతల్ బ్రాంచ్‌లో అత్యాధునిక శాఖలను బిఒఎం ప్రారంభించింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/cfc9debf-38ca-4349-8f4a-bd7dd3cf1ca5-1024x461.jpg)
హైదరాబాద్ జోన్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డిప్యూటీ జోనల్ మేనేజర్ K.E హరికృష్ణ సమక్షంలో బీఎన్ రెడ్డి నగర్‌లో అత్యాధునిక శాఖలను G.S.D ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ శాఖను ప్రారంభించడంతో, BOM ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 72 శాఖలను కలిగి ఉంది.