Friday, October 18, 2024
Homeట్రేడింగ్Microsoft: ఈ రోజు నుంచి వేలమంది లే-ఆఫ్స్

Microsoft: ఈ రోజు నుంచి వేలమంది లే-ఆఫ్స్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఈరోజు నుంచి వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే ప్రక్రియ స్టార్ట్ అవుతోంది. గతేడాది లాస్ట్ క్వార్టర్ రిపోర్టు ప్రకటించేందుకు వారం ముందు నుంచే భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. గ్లోబల్ ఎకనమిక్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫోర్స్ భారాన్ని వదిలించుకోవటంలో భాగంగా ఇదంతా జరుగుతోంది. బుధువారం నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ సెక్షన్ లో ఈ తొలగింపు ప్రక్రియ మొదలు అవుతోంది.

- Advertisement -

220,000 మంది వర్కర్లున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ.. సేల్స్ ఫోర్స్, అమెజాన్ బాటలో పయనిస్తోంది. అమెజాన్ లో 18,000 మందిని, మెటాలో 11,000 మందిని తొలగించేశారు. ట్విట్టర్లో ఏకంగా 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వంతు వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News