ఫర్నిచర్ రిటైలింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో నియాన్షి ఫర్నీచర్స్ & మోర్ హైదరాబాద్ అంతటా మూడు ప్రీమియం షోరూమ్‌లను ప్రారంభించింది. తెలంగాణలో కొత్త చైన్ ఆఫ్ ఫర్నీచర్ షోరూమ్‌లు ప్రారంభించింది నియాన్షి. ప్రమోటర్లు ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు షోరూమ్‌లను ప్రారంభించటం విశేషంకాగా త్వరలో మరిన్ని ఔట్‌లెట్‌లను ప్రారంభించేందుకు వీరు సిద్ధంగా ఉన్నారు.
అల్వాల్, కొంపల్లిలో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మర్రి రాజశేఖర్ రెడ్డి పలువురు వీఐపీ అతిథుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. మూడు అవుట్‌లెట్లు అల్వాల్, అత్తాపూర్ లో ప్రారంభించారు.
మార్కెట్లో ప్రస్తుతం మంచి నాణ్యమైన, స్టైలిష్ ఫర్నీచర్ అవసరాలు చాలా పెరిగాయని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఆకాష్ చెప్పారు. మరే ఇతర స్టోర్స్ లో లభించని, ఎక్స్ క్లూజివ్ ఫర్నీచర్ తో పాటు చూసేందుకు అందమైన కళాఖండాల్లా కనిపించేలా తమ ఫర్నీచర్ ఉంటుందని ఆకాష్ సగర్వంగా వివరించారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ మరో 7 షోరూములు త్వరలో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
అల్వాల్ అవుట్‌లెట్ 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసినట్టు, గ్రౌండ్ ఫ్లోర్‌లో విలాసవంతమైన సోఫాలు, లివింగ్ రూమ్ ఫర్నిచర్ ఉండగా, మొదటి అంతస్తులో డైనింగ్ టేబుల్స్, మాడ్యులర్ కిచెన్‌లు ఉన్నాయని వివరించారు. బేస్‌మెంట్‌లో వార్డ్‌రోబ్‌లు, మంచాలు, పరుపులు, ఇతర గృహోపకరణాలతో పాటు 300+ ప్రత్యేకమైన మోడళ్ల భారీ శ్రేణితో, నియాన్షి పూర్తిస్థాయి ఫర్నిచర్ సొల్యూషన్‌లను అందించి, కస్టమర్లను ఆకట్టుకోనుంది. పైగా నియాన్షికి వచ్చిన కస్టమర్లకు కార్ పార్కింగ్ పుష్కలంగా ఉందని నియాన్షి సంస్థ వెల్లడించింది.