Nothing Phone 3: మీరు చాలారోజులుగా ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్! అమెజాన్ నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ పరికరాన్ని అసలు ధర నుంచి ఏకంగా రూ. 32,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలు పై అమెజాన్ ఇండియా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఫ్లాగ్‌షిప్ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఆఫర్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
also read:Vivo Y500 Pro Launched: వివో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్..200ఎంపీ కెమెరా, 7000ఎంఏహెచ్ బ్యాటరీ!
నథింగ్ ఫోన్ (3) ఆఫర్:
కంపెనీ నథింగ్ ఫోన్ (3) (12GB, 256GB) స్టోరేజీ వేరియంట్ ను రూ. 79,999 కు మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ పరికరం అమెజాన్ లో రూ. 32,000 తగ్గింపుతో రూ. 47,999కి లిస్ట్ అయింది. అదనంగా అమెజాన్ బ్యాంక్ ఆఫర్లు, వివిధ కార్డ్‌లపై మరిన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు కంపెనీ ఈ పరికరం పై రూ.44,050 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. కాకపోతే ఎక్స్ఛేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. కస్టమర్లు ఈ ఫోన్ ను నెలకు రూ.2,327 నుండి ప్రారంభమయ్యే EMI ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు.
నథింగ్ ఫోన్ (3) ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..నథింగ్ ఫోన్ (3) HDR10+ సపోర్ట్‌తో 6.67-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది అల్ట్రా-స్మూత్ విజువల్స్, షార్ప్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. దీని బ్రైట్‌నెస్ 4,500 నిట్‌ల వరకు చేరుకుంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా రక్షణ పొందుతుంది. ఇది స్క్రాచ్, డ్రాప్ రెసిస్టెంట్‌గా చేస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. గరిష్టంగా 16GBRAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడింది. ఫోటోగ్రఫీ పరంగా..నథింగ్ ఫోన్ (3) 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.ప్రైమరీ సెన్సార్, పెరిస్కోప్ లెన్స్, అల్ట్రావైడ్ కెమెరా. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే..ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


